పవన్ పక్కన నిధి అగర్వాల్..

Nidhhi Agerwal: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ 27వ సినిమా క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం షూటింగ్ ప్రారంభమైంది. పవన్ పుట్టినరోజు సందర్భంగా గతేడాది సెప్టెంబర్ 2న ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది.
హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో ప్రెస్టీజియస్‌గా తెరకెక్కుతున్న PSPK 27 లో పవన్ హరి హర వీరమల్లు పాత్రలో కనిపించున్నారని సమాచారం. తాజాగా కథానాయికను ఫిక్స్ చేశారు. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ పవన్ పక్కన నటించనుంది. ఈ మూవీలో నిధి మహారాణి పాత్రలో కనిపించనుందట. కెరీర్ పరంగా నిధికి ఇది బిగ్ బ్రేక్ అనే చెప్పాలి. ఆమె స్టార్ హీరోతో నటించడం ఇదే ఫస్ట్ టైమ్.
ఇటీవలే రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ షూటింగ్‌కి గుమ్మడికాయ కొట్టిన పవర్‌స్టార్ ప్రస్తుతం క్రిష్ సినిమా మీదే దృష్టి పెట్టారు. ఇది పూర్తయిన తర్వాత హరీష్ శంకర్, సురేందర్ రెడ్డిలతోనూ సినిమాలు చెయ్యనున్నారు పవన్ కళ్యాణ్.