Heavy Rains: చల్లటి కబురు.. దేశవ్యాప్తంగా వానలు

ఎండలతో అట్టుడుకుతున్న దేశానికి చల్లటి కబురు చెప్పింది భారత వాతావరణ శాఖ. రానున్న ఐదు రోజుల్లో భారత దేశంలోని ఉత్తర, తూర్పు రాష్ట్రాలతోపాటు, ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది.

Heavy Rains: ఎండలతో అట్టుడుకుతున్న దేశానికి చల్లటి కబురు చెప్పింది భారత వాతావరణ శాఖ. రానున్న ఐదు రోజుల్లో భారత దేశంలోని ఉత్తర, తూర్పు రాష్ట్రాలతోపాటు, ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది. ముఖ్యంగా సోమవారం అధిక వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది. రాయలసీమ ప్రాంతంలో ఏర్పడ్డ సైక్లోన్ కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

car stunt.. man in jail: అజయ్ దేవ్‌గన్‌లా కార్లతో స్టంట్… అరెస్టైన యువకుడు

వాతావరణ శాఖ అంచనా ప్రకారం బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులు కూడా ఉండే అవకాశం ఉంది. ఎండలతో అట్టుడికిన రాజస్థాన్‌లో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గాయి. కేరళ, త్రిపుర, మేఘాలయల్లోనూ వర్షాలు కురుస్తాయి. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అసోం, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, పశ్చిమ బెంగాల్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఐదు రోజులు వర్షాలు కురవొచ్చు.

BJP Ultimatum: పెట్రో ధరల తగ్గింపుపై తమిళనాడు ప్రభుత్వానికి బీజేపీ అల్టిమేటమ్

భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ ఏడాది మొదటి నైరుతి రుతుపవనాలు ఈ నెల 27న కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉంది. సాధారణంగా రుతుపవనాలు ప్రవేశించే గడువు కంటే ఈసారి ఐదు రోజులు ముందుగానే వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు