BJP Ultimatum: పెట్రో ధరల తగ్గింపుపై తమిళనాడు ప్రభుత్వానికి బీజేపీ అల్టిమేటమ్

పెట్రో ధరల తగ్గింపు విషయంలో ప్రజలకిచ్చిన హామీ నిలబెట్టుకోవాలని, లేకపోతే ఆందోళనలు చేపడతామని తమిళనాడులోని డీఎమ్‌కే ప్రభుత్వాన్ని హెచ్చరించింది బీజేపీ. ఇందుకు 72 గంటల గడువిచ్చింది.

BJP Ultimatum: పెట్రో ధరల తగ్గింపుపై తమిళనాడు ప్రభుత్వానికి బీజేపీ అల్టిమేటమ్

Annamalai

BJP Ultimatum: పెట్రో ధరల తగ్గింపు విషయంలో ప్రజలకిచ్చిన హామీ నిలబెట్టుకోవాలని, లేకపోతే ఆందోళనలు చేపడతామని తమిళనాడులోని డీఎమ్‌కే ప్రభుత్వాన్ని హెచ్చరించింది బీజేపీ. ఇందుకు 72 గంటల గడువిచ్చింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఆదివారం ప్రభుత్వానికి అల్టిమేటమ్ జారీ చేశారు.

Boy Falls In Borewell: 300 అడుగుల బోరుబావిలో ఆరేళ్ల బాలుడు

అన్నామలై ట్విట్టర్ ప్రకటన ప్రకారం.. 2021 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.4, ఎల్పీజీ సిలిండర్‌పై రూ.100 తగ్గిస్తామని డీఎమ్‌కే హామీ ఇచ్చింది. అయితే, అధికారం చేపట్టి ఇంతకాలం అవుతున్నా ఈ హామీని ఇప్పటివరకు డీఎమ్‌కే నిలబెట్టుకోలేదు. దీంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీని డీఎమ్‌కే నిలబెట్టుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. హామీ ప్రకారం 72 గంటల్లోగా పెట్రో ధరలు తగ్గించకుంటే, సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించింది. శనివారం కేంద్ర ప్రభుత్వం పెట్రో ధరలు తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనేక రాష్ట్రాలపై పెట్రో ధరలు తగ్గించాలని ఒత్తిడి పెరుగుతోంది.

car stunt.. man in jail: అజయ్ దేవ్‌గన్‌లా కార్లతో స్టంట్… అరెస్టైన యువకుడు

ముఖ్యంగా ఇతర పార్టీలు అధికారంలో ఉన్నచోట బీజేపీ పెట్రో ధరల తగ్గింపు కోరుతూ డిమాండ్ చేస్తోంది. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం పెట్రో ధరల తగ్గింపుపై బీజేపీనే విమర్శిస్తోంది. రెండేళ్లలో ఎన్నోసార్లు పెట్రో ధరలు పెంచి, ఒక్కసారి తగ్గిస్తే సరిపోతుందా అంటూ ప్రశ్నించింది.