car stunt.. man in jail: అజయ్ దేవ్‌గన్‌లా కార్లతో స్టంట్… అరెస్టైన యువకుడు

సినిమా హీరోల్లా స్టంట్లు చేద్దామంటే రియల్ లైఫ్‌లో కుదరదు. రిస్క్ తీసుకుని కొన్నిసార్లు ట్రై చేసినా ప్రమాదాల బారిన పడొచ్చు. లేదా పోలీసు కేసు ఎదుర్కోవాల్సి రావొచ్చు. తాజాగా బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గన్‌లా స్టంట్లు చేసేందుకు ప్రయత్నించిన ఒక యువకుడు జైలు పాలయ్యాడు.

car stunt.. man in jail: అజయ్ దేవ్‌గన్‌లా కార్లతో స్టంట్… అరెస్టైన యువకుడు

Car Stunt

Updated On : May 22, 2022 / 6:55 PM IST

car stunt.. man in jail: సినిమా హీరోల్లా స్టంట్లు చేద్దామంటే రియల్ లైఫ్‌లో కుదరదు. రిస్క్ తీసుకుని కొన్నిసార్లు ట్రై చేసినా ప్రమాదాల బారిన పడొచ్చు. లేదా పోలీసు కేసు ఎదుర్కోవాల్సి రావొచ్చు. తాజాగా బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గన్‌లా స్టంట్లు చేసేందుకు ప్రయత్నించిన ఒక యువకుడు జైలు పాలయ్యాడు. ఈ ఘటన ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో జరిగింది.

Boy Falls In Borewell: 300 అడుగుల బోరుబావిలో ఆరేళ్ల బాలుడు

బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గన్‌ తన మొదటి చిత్రం ‘పూల్ ఔర్ కాంటే’లో ఒక స్టంట్ చేశాడు. రెండు కార్లపై రెండు కాళ్లుపెట్టి, నిలబడి వెళ్లే సన్నివేశం అది. ఇటీవల విడుదలైన ‘గోల్‌మాల్-3’లో కూడా అదే స్టంట్ రిపీట్ చేశారాయన. అయితే, అదే స్టంట్‌ను నోయిడాలోని సొరాకా అనే గ్రామానికి చెందిన రాజీవ్ అనే యువకుడు కూడా ట్రై చేశాడు. రెండు ఎస్‌యూవీలు కదులుతుండగా, రాజీవ్ వాటిపై కాళ్లు పెట్టి నిలుచున్నాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఉద్దేశంతో ఈ వీడియో తీయించుకున్నాడు. తర్వాత దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందించిన పోలీసు అధికారులు యువకుడిపై కేసు నమోదు చేశారు. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం వాహనాలతో రోడ్డుపై న్యూసెన్స్‌కు పాల్పడ్డాడని, ప్రమాదకర స్టంట్స్ చేశాడని అతడిపై కేసు నమోదు చేశారు.

Qutub Minar: కుతుబ్ మినార్ వద్ద తవ్వకాలు.. కిషన్ రెడ్డి ఏం చెప్పారంటే

వీడియో ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. వీడియోలో కనిపించిన రెండు వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ వీడియో కోసం అతడు రెండు టొయోటా ఫార్చ్యూనర్ వాహనాల్ని వినియోగించాడు. అందులో ఒకటి వాళ్ల సొంత వాహనం కాగా, మరొకటి స్నేహితుడిది. ప్రస్తుతం ఈ రెండింటినీ పోలీస్ స్టేషన్‌లో ఉంచారు.