Qutub Minar: కుతుబ్ మినార్ వద్ద తవ్వకాలు.. కిషన్ రెడ్డి ఏం చెప్పారంటే

ఢిల్లీలోని కుతుబ్ మినార్‌పై కూడా కొంతకాలంగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కుతుబ్ మినార్ దగ్గర తవ్వకాలు జరపాలని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ‘ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)’ ఆదేశాలిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

Qutub Minar: కుతుబ్ మినార్ వద్ద తవ్వకాలు.. కిషన్ రెడ్డి ఏం చెప్పారంటే

Qutub Minar

Qutub Minar: ఢిల్లీలోని కుతుబ్ మినార్‌పై కూడా కొంతకాలంగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కుతుబ్ మినార్ దగ్గర తవ్వకాలు జరపాలని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ‘ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)’ ఆదేశాలిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలను కేంద్ర సాంస్కృతిక శాఖా మంత్రి జి.కిషన్ రెడ్డి కొట్టిపారేశారు.

Delhi’s triple suicide: దారుణం.. విషవాయువు పీల్చి తల్లీ కూతుళ్ల ఆత్మహత్య

ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవలి కాలంలో కొన్ని మసీదుల్లో హిందూ నిర్మాణాలు, దేవతల విగ్రహాలు ఉన్నట్లు ప్రచారం మొదలైన దృష్ట్యా, పలు చోట్ల తవ్వకాలు కూడా జరుగుతున్నాయి. అదే కోవలో కుతుబ్ మినార్‌పై కూడా వివాదం మొదలైంది. కుతుబ్ మినార్ ఒకప్పుడు హిందూ దేవాలయమని, దీన్ని హిందూ చక్రవర్తి అయిన రాజా విక్రమాదిత్య నిర్మించారని ఇటీవల పురాతత్వ శాస్త్ర నిపుణుడు ఒకరు ఆరోపించారు. సూర్యుడి గమనాన్ని కొలిచేందుకు దీన్ని నిర్మించారని, ఇక్కడ అనేక హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయని ఆయన చెప్పాడు.

Amit Shah to Rahul Gandhi: ఇటలీ కళ్లద్దాలు తీసేయండి.. రాహుల్‌కు అమిత్ షా చురక

దీంతో కుతుబ్ మినార్ వద్ద తవ్వకాలు జరిపి, వాస్తవాలు తేల్చాలని హిందూ సమాజానికి చెందిన పలువురు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కుతుబ్ మినార్ వద్ద తవ్వకాలకు కేంద్రం అనుమతించినట్లు ప్రచారం జరుగుతోంది.