Mamata Banerjee's 'dream for India
presidential election 2022: దేశంలో త్వరలో జరగాల్సిన రాష్ట్రపతి ఎన్నికలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ… ”రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించేముందు మాతో బీజేపీ చర్చించలేదు. బీజేపీ మా సూచనలు తీసుకుంటే బాగుండేది. ఇలా చేస్తే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ముకు మద్దతు తెలిపే అంశంపై ఆలోచించేవాళ్ళం” అని మమతా బెనర్జీ అన్నారు.
Maharashtra: 4న మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షకు దిగుతున్న ఏక్‌నాథ్ షిండే
మహారాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తూ మమతా బెనర్జీ బీజేపీకి చురకలంటించారు. రాష్ట్రపతి ఎన్నికలో గెలుపొందే అవకాశాలు ఇప్పుడు ద్రౌపది ముర్ముకి బాగా ఉన్నాయని ఆమె ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో చాలా మంది శివసేన ఎమ్మెల్యేలు బీజేపీతో కలిసిన విషయం తెలిసిందే. కాగా, రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేసేముందు ద్రౌపది ముర్ము మమతా బెనర్జీతో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు ఫోన్లు చేసి మద్దతు ఇవ్వాలని అడిగారు. విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ వేశారు. ఈ ఎన్నిక జూలై 18న జరగనుంది.
Maharashtra: ఇదే పని రెండున్నరేళ్ళ క్రితం బీజేపీ ఎందుకు చేయలేదు?: ఉద్ధవ్ ఠాక్రే
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు తెలపడానికి పంజాబ్‌లోని శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్, కర్ణాటకలోని జేడీఎస్ నేత హెచ్‌డీ దేవెగౌడ అంగీకరించారు. వారితో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చర్చలు జరపడంతో వారు ఒప్పుకున్నారు.