Maharashtra: 4న మ‌హారాష్ట్ర అసెంబ్లీలో బ‌ల‌ప‌రీక్ష‌కు దిగుతున్న ఏక్‌నాథ్ షిండే

స్పీక‌ర్ ప‌ద‌వికి ఆదివారం ఎన్నిక జ‌రిగే అవ‌కాశం ఉంది. అదే రోజు సమావేశంలో స్పీకర్‌ను ఎన్నుకుని, త‌దుపరి రోజు ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది.

Maharashtra: 4న మ‌హారాష్ట్ర అసెంబ్లీలో బ‌ల‌ప‌రీక్ష‌కు దిగుతున్న ఏక్‌నాథ్ షిండే

Eknath Shinde

Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఈ నెల 4న విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ విషయాన్ని అధికార వ‌ర్గాలు మీడియాకు తెలిపాయి. శాసనసభ ప్రత్యేక సమావేశాలు జూలై 3 నుంచి జరగనున్నాయి. మ‌హారాష్ట్ర అసెంబ్లీ స్పీక‌ర్ ప‌ద‌వి కోసం బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ న‌ర్వేక‌ర్ ఇవాళ‌ నామినేష‌న్ దాఖ‌లు చేశారు. స్పీక‌ర్ ప‌ద‌వికి ఆదివారం ఎన్నిక జ‌రిగే అవ‌కాశం ఉంది. అదే రోజు సమావేశంలో స్పీకర్‌ను ఎన్నుకుని, త‌దుపరి రోజు ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది.

Maharashtra: ఇదే ప‌ని రెండున్న‌రేళ్ళ క్రితం బీజేపీ ఎందుకు చేయ‌లేదు?: ఉద్ధ‌వ్ ఠాక్రే

కాగా, మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి శివ‌సేన నేత ఉద్ధ‌వ్ ఠాక్రే రాజీనామా చేయ‌డంతో ఆ పార్టీ తిరుగుబాటు నేత‌ ఏక్‌నాథ్ షిండేను ఆ ప‌ద‌వి వ‌రించిన విష‌యం తెలిసిందే. దీంతో ఉద్ధ‌వ్ ఠాక్రే అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోలేదు. ఏక్‌నాథ్ షిండే ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌గా, బీజేపీ నేత ఫ‌డ్న‌వీస్ ఉప ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. బీజేపీ మ‌ద్ద‌తుతో ఏక్‌నాథ్ షిండే బ‌ల‌ప‌రీక్ష‌కు దిగుతున్నారు.