NTR: చరణ్ లేకపోతే ఆర్ఆర్ఆర్ లేదు – తారక్!

టాలీవుడ్‌లోనే ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది....

Rrr Jr Ntr Ramcharan

NTR: టాలీవుడ్‌లోనే ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అయ్యి నాలుగు రోజులు దాటినా బాక్సాఫీస్ వద్ద మాత్రం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది.

కాగా ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించడంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కట్టారు. అయితే ఈ సినిమా చూసిన కొంతమంది మాత్రం ఈ చిత్రంపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారని.. తారక్ పాత్ర నిడివి తగ్గించారని వారు అంటున్నారు. అయితే ఇలాంటి నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నవారందరికీ తారక్ తాజాగా ఓ లేఖ ద్వారా చెక్ పెట్టాడు. ఆర్ఆర్ఆర్ చిత్ర సక్సెస్‌పై తారక్ తాజాగా ఓ లేఖను రిలీజ్ చేశారు.

RRR: రాజమౌళి-రామారావు-రామ్ చరణ్.. నెక్స్ట్ ఏంటి?

ఆర్ఆర్ఆర్ సినిమాకు యావత్ ఇండియన్ సినిమా లవర్స్ తమ మద్దతును తెలిపారని.. ఇది భారతీయ చిత్ర పరిశ్రమ ఐక్యతను చాటి చెప్పిన చిత్రం అని తారక్ అన్నాడు. భారతీయ సినిమా ప్రస్తుతం ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా ఉందని.. ఆర్ఆర్ఆర్ చిత్ర నటీనటులు, సాంకేతిక బృందానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఇక తన సోదరుడు చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రకు పూర్తి న్యాయం చేశాడని తారక్ అన్నాడు. అసలు చరణ్ లేకపోతే ఆర్ఆర్ఆర్ చిత్రం లేదని ఆయన అనడం విశేషం. సీతరామరాజు పాత్రలో చరణ్ లేకపోతే భీమ్ పాత్ర అసంపూర్తిగా ఉండేదని తారక్ చెప్పుకొచ్చాడు. ఇలాంటి పాత్రలను తమకు అందించిన దర్శకధీరుడు జక్కన్నకు ఎప్పటికీ రుణపడి ఉంటాం అంటూ తారక్ లేఖలో పేర్కొన్నాడు.

RRR : సినిమా అర్దమవ్వట్లేదు.. సబ్ టైటిల్స్ కావాలి.. ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్‌కి ఆడియన్స్ విజ్ఞప్తి..

మొత్తానికి ఆర్ఆర్ఆర్ చిత్రంపై వస్తున్న నెగెటివ్ కామెంట్స్‌కు తారక్ ఈ లేఖ ద్వారా చెక్ పెట్టాడని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలోని ‘కొమురం భీముడో..’ పాటలో తారక్ పర్ఫార్మెన్స్‌కు జనం నీరాజనం పడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తొలి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.500 కోట్ల మేర వసూళ్లు సాధించి ఇండియన్ సినిమా స్టామినాను మరోసారి ప్రూవ్ చేసింది.