RRR: రాజమౌళి-రామారావు-రామ్ చరణ్.. నెక్స్ట్ ఏంటి?

హై ఎక్స్ పెక్టేషన్స్.. టాప్ నాచ్ ప్రమోషన్స్ మధ్య మొత్తానికి రిలీజైంది ఆర్ఆర్ఆర్. రాజమౌళి మార్క్ డైరెక్షన్.. చరణ్, తారక్ యాక్షన్, స్క్రీన్ ప్రజెంటేషన్.. ఫ్యాన్స్ ను ఉరకలెత్తిస్తుంది

RRR: రాజమౌళి-రామారావు-రామ్ చరణ్.. నెక్స్ట్ ఏంటి?

Rrr

Updated On : March 26, 2022 / 8:52 PM IST

RRR: హై ఎక్స్ పెక్టేషన్స్.. టాప్ నాచ్ ప్రమోషన్స్ మధ్య మొత్తానికి రిలీజైంది ఆర్ఆర్ఆర్. రాజమౌళి మార్క్ డైరెక్షన్.. చరణ్, తారక్ యాక్షన్, స్క్రీన్ ప్రజెంటేషన్.. ఫ్యాన్స్ ను ఉరకలెత్తిస్తుంది. ఏదైతేనేం మూడున్నరేళ్ల నిరీక్షణకు తెరపడింది. ఓవర్సీస్ నుండి లోకల్ వరకు ఎక్కడ చూసినా భారీ కలెక్షన్లను కొల్లగొట్టేస్తుంది ఆర్ఆర్ఆర్. ట్రిపుల్ ఆర్ సినిమా ఇక తనపని తాను చేసుకుంటూ పోతుంది. ఇక ట్రిపుల్ ఆర్ నెక్ట్స్ టార్గెట్ ఏంటి…? రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ ఏం చేయబోతున్నారు?

Rajamouli: మహేష్ కోసం అడవి బాట పడుతున్న జక్కన్న..?

ట్రిపుల్ ఆర్ వచ్చేసింది. మూడేళ్లకు పైగా స్క్రీన్ కి దూరమైన చరణ్, తారక్ లను చూసి రెచ్చిపోతున్నారు ఫ్యాన్స్. రాజమౌళి మార్క్ సీన్స్ కొన్ని ఆడియెన్స్ ను ఫిదా చేస్తున్నాయి. ఇక రికార్డ్స్, బాక్సాఫీస్ కలెక్షన్స్ అన్నీ అతి త్వరలో తేలిపోతాయి. ఇక కాస్త రిలాక్సయి ట్రిపుల్ ఆర్ నెక్ట్స్ పనులపై కాన్సట్రేట్ పెంచేస్తారు. మహేశ్ బాబుతో మూవీని బాహుబలి, ట్రిపుల్ ఆర్ కి మించి తీస్తానని చెప్పిన జక్కన్న.. ఆ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్ తో బిజీ అయిపోతారు. ఫారెస్ట్ అడ్వంచరస్ డ్రామా కాన్సెప్ట్ తో మహేశ్ – రాజమౌళి కాంబో 2023లో సెట్స్ పైకెళ్లే ఛాన్స్ ఉంది.

NTR30: కొత్త సినిమా మొదలెప్పుడు తారక్.. అభిమానుల ఆవేదన!

కొమురం భీంగా థియేటర్స్ ని దడదడలాడిస్తున్న మరో ఆర్.. రామారావ్.. పెద్దగా కొత్త సినిమాలతో ఎంగేజ్ కాలేదు. ట్రిపుల్ ఆర్ తర్వాత ప్రమోషన్స్ లోనే కనిపించిన తారక్.. కొరటాల శివ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేయాల్సి ఉంది. అయితే ఆచార్య రిలీజ్ తర్వాతే కొరటాల – ఎన్టీఆర్ ప్రాజెక్ట్ సెట్స్ పైకెళ్తుంది. ఇక లైన్ లో బుచ్చిబాబు, ప్రశాంత్ నీల్ వంటి డైరెక్టర్స్ ఉన్నా తారక్ ఎప్పుడెవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు.

Ram Charan : అప్పుడే RC15 రిలీజ్ డేట్ ఫిక్స్..

ట్రిపుల్ ఆర్ చేస్తున్నా సరే.. అలర్ట్ గా ఉన్న ఆర్.. రామ్ చరణ్. జక్కన్న సినిమా సెట్స్ పై ఉండగానే ఆచార్యకు కమిట్ మెంట్ ఇచ్చారు. షూటింగ్ కానిచ్చారు. వెంటనే శంకర్ సినిమా కోసం రెండు షెడ్యూల్స్ పూర్తి చేశారు. రాబోయే కొన్ని రోజుల్లో గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించబోతున్నారు. సో రెస్ట్ లేకుండా చరణ్ మళ్లీ బరిలోకి దూకాల్సి ఉంది. ఆచార్య ప్రమోషన్స్ తర్వాత శంకర్ మూవీలో నటిస్తారు. వచ్చే సంక్రాంతికే శంకర్ ప్రాజెక్ట్ ప్లాన్ చేశారు కాబట్టి ముందు దానిని పూర్తి చేస్తారు. సో చరణ్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చేలా రెడీ అయ్యారు.