Rajamouli: మహేష్ కోసం అడవి బాట పడుతున్న జక్కన్న..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇప్పుడు మరోసారి యావత్ ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. తాజాగా ఆయన....

Rajamouli: మహేష్ కోసం అడవి బాట పడుతున్న జక్కన్న..?

Rajamouli Project With Mahesh Babu

Rajamouli: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇప్పుడు మరోసారి యావత్ ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. తాజాగా ఆయన తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం రిలీజ్‌కు రెడీగా ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న చిత్ర యూనిట్ ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కోసం రెడీ అయ్యారు. ఇక ఈ సినిమా రిలీజ్ సందర్భంగా రాజమౌళి తండ్రి, స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

Rajamouli : హీరోలని డామినేట్ చేసిన రాజమౌళి.. థియేటర్ వద్ద భారీ కటౌట్

ఇంతకాలం ప్రమోషన్స్‌కు దూరంగా ఉన్న విజయేంద్ర ప్రసాద్, తాజాగా ఓ ఇంటర్వ్యూలో కనిపించారు. ఈ క్రమంలోనే ఆయన ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం రాజమౌళి పడ్డ కష్టాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుకు చేశారు. అంతేగాక తాను జక్కన్న నెక్ట్స్ మూవీ కోసం అప్పుడే స్క్రిప్టు పనులను స్టార్ట్ చేసేందుకు రెడీ అయినట్లు తెలిపారు. అయితే రాజమౌళి ఆర్ఆర్ఆర్ రిలీజ్ పూర్తయ్యాకే తన నెక్ట్స్ మూవీ పనులు మొదలెడతాడని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.

కాగా రాజమౌళి తన నెక్ట్స్ మూవీని స్టార్ హీరో మహేష్ బాబుతో కలిసి చేయబోతున్నట్లు, ఈ సినిమా కోసం అడవి నేపథ్యంలో సాగే కథను రెడీ చేస్తున్నట్లు విజయేంద్ర ప్రసాద్ హింట్ ఇచ్చారు. ఆఫ్రికా అడవుల్లో సాగే కథగా ఈ సినిమా ఉండబోతున్నట్లు ఆయన తెలిపారు. అడవి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో మహేష్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని ఆయన క్లూ ఇచ్చారు.

Rajamouli: జక్కన్న క్రేజీ థాట్.. రజనీ-కమల్ తో మల్టీస్టారర్ సినిమా!

ఇక ఈ వార్తతో మహేష్ అభిమానులు అప్పుడే ఈ సినిమాకు సంబంధించి అంచనాలు పెంచుతున్నారు. ఈ సినిమాతో మహేష్ మరో ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమాను భారీ బడ్జెత్‌తో తెరకెక్కించబోతున్నట్లు విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. మరి నిజంగానే మహేష్ కోసం జక్కన్న అడవిబాట పడతాడా.. లేక వేరొక స్క్రిప్టును ఓకే చేస్తాడా అనేది ఇంకా కన్ఫం కావాలి.