NTR: ఎన్టీఆర్ కూడా ఆ డైరెక్టర్‌కే ఓటేశాడా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ ఇటీవల దేశవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.....

Ntr To Do Next Movie With Anil Ravipudi

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ ఇటీవల దేశవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో మరో హీరోగా నటించారు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించిన చిత్ర యూనిట్, భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమా రిలీజ్ తరువాత తారక్ తన నెక్ట్స్ మూవీని మరో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

NTR: కొరటాల కోసం ఎన్టీఆర్ టార్గెట్ 8!

ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్ త్వరలోనే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా పట్టాలెక్కకముందే, తారక్ తన నెక్ట్స్ చిత్రాల గురించి ఆలోచిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఉప్పెన వంటి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన బుచ్చిబాబు సానాతో తారక్ ఓ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీని తెరకెక్కించబోతున్నట్లు గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాతో పాటు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కూడా తారక్ ఓ సినిమా చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.

కానీ తారక్ మాత్రం ఇప్పుడు ఈ ఇద్దరు దర్శకులను కాదని, వేరొక డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడట. కామెడీ జోనర్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్3 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ డైరెక్టర్ తన నెక్ట్స్ మూవీని నందమూరి బాలయ్యతో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. అయితే బాలయ్యతో సినిమా తరువాత అనిల్ రావిపూడి, తారక్‌తో చేతులు కలపనున్నట్లు తెలుస్తోంది.

NTR: పొలిటికల్ ఎంట్రీపై తారక్ క్లారిటీ!

అనిల్ రావిపూడి చెప్పిన ఓ కామెడీ సబ్జెక్ట్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడం ఖాయమని తారక్ భావిస్తున్నాడట. ఇక తన నుండి కామెడీ మూవీ వచ్చి చాలా రోజులవుతుందని భావిస్తున్న తారక్, అందుకే తన నెక్ట్స్ మూవీని బుచ్చిబాబు, ప్రశాంత్ నీల్‌లతో కాదని అనిల్ రావిపూడితో చేసేందుకు సిద్ధమవుతున్నాడు. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.