NTR: పొలిటికల్ ఎంట్రీపై తారక్ క్లారిటీ!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఈ....

NTR: పొలిటికల్ ఎంట్రీపై తారక్ క్లారిటీ!

Ntr Clarity On Political Entry

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించగా, మరో స్టార్ హీరో రామ్ చరణ్ ఈ సినిమాలో నటించడంతో RRR కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక తొలిరోజే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఆర్ఆర్ఆర్ కోసం జనం థియేటర్ల ముందు క్యూ కట్టారు.

RRR: ఆర్ఆర్ఆర్ మేనియా.. జక్కన్నపై కంగనా పొగడ్తల వర్షం!

అటు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. కాగా ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌ను భారీ స్థాయిలో నిర్వహించారు. అయితే ఈ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తారక్ తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఇది నెట్టింట వైరల్‌గా మారింది. గతంలో టీడీపీకి ప్రచారం చేసిన తారక్, ఆ సమయంలో యాక్సిడెంట్ కావడంతో మళ్లీ రాజకీయాల వైపు తిరిగి చూడలేదు. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో యాంకర్ తారక్‌ను ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వస్తారా అని ప్రశ్నించగా.. తాను ఇప్పుడు చేస్తున్న యాక్టింగ్ ప్రొఫెషన్ తనకు చాలా సంతోషాన్ని ఇస్తుందని తారక్ అన్నాడు.

NTR: కొరటాల కోసం ఎన్టీఆర్ టార్గెట్ 8!

యాక్టర్‌గా తన ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నానని.. భవిష్యత్తు అంటే 10 సంవత్సరాలో లేక 5 సంవత్సరాలో కాదు.. నెక్ట్స్ సెకన్ ఏం జరుగుతుందో అని ఆలోచించే వ్యక్తిగా తాను ఉంటానని తారక్ చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం తాను సినిమా రంగంలోనే ఉంటానని తారక్ గట్టిగా చెప్పడంతో, ఎన్టీఆర్ పొలిటిక్ ఎంట్రీ ఇప్పట్లో లేనట్లే అనేది క్లారిఫై అయ్యింది. ఏదేమైనా తారక్ రాజకీయాల్లోకి రానని చెప్పడంతో ఆయన అభిమానులు నిరాశకు లోనవుతున్నారు. ఇక తారక్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.