NTR: కొరటాల కోసం ఎన్టీఆర్ టార్గెట్ 8!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఇండియన్ మోస్ట్ వెయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఏకంగా మూడున్నరేళ్లకు పైగా కష్టపడ్డ తారక్, మరే ఇతర సినిమాను....

NTR: కొరటాల కోసం ఎన్టీఆర్ టార్గెట్ 8!

Ntr To Cut Down 8 Kgs Weight For Koratala Movie

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఇండియన్ మోస్ట్ వెయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఏకంగా మూడున్నరేళ్లకు పైగా కష్టపడ్డ తారక్, మరే ఇతర సినిమాను కూడా ఓకే చేయలేదు. ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చిన తారక్, తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఇక ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్న తీరుకు తాజాగా ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అయితే తారక్ ఆర్ఆర్ఆర్ తరువాత తన నెక్ట్స్ ప్రాజెక్టును మరో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

RRR: తగ్గని జోరు.. హిందీలో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన ఆర్ఆర్ఆర్!

ఇప్పటికే ఈ ప్రాజెక్టును అఫీషియల్‌గా అనౌన్స్ కూడా చేశారు. కానీ ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం బిజీగా ఉన్న తారక్, ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించలేదు. అయితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ పూర్తి కావడం.. ఆ సినిమా నుండి బయటపడ్డ తారక్, త్వరలోనే కొరటాల శివతో చేయబోయే సినిమాను ప్రారంభించే పనిలో పడ్డాడట. కానీ ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను వేసవి తరువాతే పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. తారక్ కెరీర్‌లో 30వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా కోసం తారక్ మరోసారి బరువు తగ్గనున్నాడట. ఈ సినిమాను జూన్ నెలలో ప్రారంభించాలని తారక్ అండ్ టీమ్ ప్రయత్నిస్తున్నారట.

దీంతో ఏప్రిల్, మే రెండు నెలల సమయం ఉండటంతో తారక్ వర్కవుట్స్ చేసి తన బరువును ఏకంగా 8 కిలోల మేర తగ్గించాలని ఫిక్స్ అయ్యాడట. ఈ సినిమాలో తారక్ మరోసారి స్లిమ్ లుక్‌లో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేయనున్నాడట. గతంలోనూ యమదొంగ, కంత్రి వంటి సినిమాల్లో తారక్ చాలా స్లిమ్‌గా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మరోసారి కొరటాల సినిమాలోనూ స్లిమ్ లుక్‌లో దర్శనమిచ్చేందుకు తారక్ రెడీ అవుతున్నాడట. ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను కొరటాల తనదైన మార్క్ టేకింగ్‌తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

NTR: కొరటాలతో మూవీ అప్పుడే మొదలవుతుందా..?

ఇక ఈ సినిమాలో తారక్ సరికొత్త లుక్‌లో కనిపిస్తాడని.. ఆర్ఆర్ఆర్ బ్యూటీ ఆలియా భట్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు కోలీవుడ్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నాయి. మరి ఈ సినిమాలో తారక్ ఎలాంటి పాత్రలో రఫ్ఫాడిస్తాడో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.