NTR: కొరటాలతో మూవీ అప్పుడే మొదలవుతుందా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది......

NTR: కొరటాలతో మూవీ అప్పుడే మొదలవుతుందా..?

Ntr To Start Koratala Siva Movie To Start At This Time

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఈ చిత్రాన్ని భారీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించగా, ఈ సినిమాలో మరో స్టార్ హీరో రామ్ చరణ్ కూడా నటించాడు. ఈ సినిమాను పీరియాడికల్ ఫిక్షన్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కించడంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా రిజల్ట్‌తో హ్యాపీగా ఉన్న తారక్, తన నెక్ట్స్ మూవీని ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

NTR: చరణ్ లేకపోతే ఆర్ఆర్ఆర్ లేదు – తారక్!

అటు రామ్ చరణ్ ఇప్పటికే తన నెక్ట్స్ మూవీని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. కానీ తారక్ మాత్రం ఆర్ఆర్ఆర్ కోసమే ఇంతకాలం వెయిట్ చేశాడు. దీంతో తారక్ కూడా తన నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేస్తే బాగుంటుందని అభిమానులు కోరుతున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాను ఎప్పుడు లాంఛ్ చేస్తారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

NTR : డబల్ హ్యాట్రిక్‌తో సరికొత్త రికార్డు సాధించిన ఎన్టీఆర్

కాగా ఆర్ఆర్ఆర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న తారక్, కొంత గ్యాప్ తీసుకున్నాకే కొరటాలతో సినిమాను ప్రారంభిస్తారని అందరూ అనుకున్నారు. కానీ దీనిలో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. తారక్ వెంటనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాలని చూస్తున్నాడట. ఈ సినిమా షూటింగ్‌ను జూన్ నెల మొదటి వారంలోనే ప్రారంభించాలని తారక్ భావిస్తున్నాడట. అటుపై ఈ సినిమా షూటింగ్‌ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని తారక్ ఆలోచిస్తున్నాడు. మరి తారక్ అనుకున్నట్లుగానే ఈ సినిమా షూటింగ్‌ను జూన్ నెలలో ప్రారంభిస్తాడా లేడా అనేది చూడాలి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్‌గా నటిస్తుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.