Asaduddin Owaisi: ఇద్దరు పిల్లల చట్టాన్ని సమర్ధించను: ఒవైసీ

చైనా చేసిన పొరపాటే మనం తిరిగి చేయొద్దు. జనాభా నియంత్రణ కోసం ఇద్దరు పిల్లల్ని మాత్రమే కనాలి అనే చట్టం తీసుకొస్తే సమర్ధించను. ఇది దేశానికి ఎంతమాత్రం మంచిది కాదు. 2030కల్లా దేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గుతుంది. అదే జనాభాను స్థిరంగా ఉంచుతుంది అని అభిప్రాయపడ్డారు.

Asaduddin Owaisi: దేశంలో జనాభా నియంత్రణ కోసం ఇద్దరు పిల్లల్ని మాత్రమే కనాలి అనే చట్టం తీసుకొస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్ధించబోను అన్నారు ఏఐఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ. గురువారం ఆయన ఒక మీడియా సంస్థతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రం జనాభా నియంత్రణ కోసం చట్టం రూపొందిస్తుందన్న ప్రచారంపై స్పందించారు.

Eye Drops: కళ్లద్దాలకు చెక్.. ఐ డ్రాప్స్‌తో మెరుగయ్యే కంటి చూపు

‘‘చైనా చేసిన పొరపాటే మనం తిరిగి చేయొద్దు. జనాభా నియంత్రణ కోసం ఇద్దరు పిల్లల్ని మాత్రమే కనాలి అనే చట్టం తీసుకొస్తే సమర్ధించను. ఇది దేశానికి ఎంతమాత్రం మంచిది కాదు. 2030కల్లా దేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గుతుంది. అదే జనాభాను స్థిరంగా ఉంచుతుంది’’ అని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై గతంలో కూడా మాట్లాడారు. ‘‘దేశంలో ముస్లింలే ఎక్కువగా గర్భనిరోధక సాధనాలు వాడుతున్నారు. జనాభా పెరుగుదలకు ముస్లింలను మాత్రమే బాధ్యుల్ని చేయడం సరికాదు. వాళ్లు భారతీయులు కాదా? ద్రవిడియన్లు, గిరిజనులు మాత్రమే అసలైన భారతీయులు. ఉత్తర ప్రదేశ్‌లో ఎలాంటి చట్టాలు లేకుండానే 2026-2030 కల్లా జనాభా నియంత్రణలోకి వస్తుంది’’ అని వ్యాఖ్యానించారు.

Dalai Lama: నేడు కాశ్మీర్‌లో పర్యటించనున్న దలైలామా

కొంతకాలంగా దేశంలో జనాభా నియంత్రణ కోసం కఠిన చట్టాలు తేవాలనే ప్రచారం జరగుతోంది. రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్, గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్, అసోం, ఒడిశాలు ఇద్దరు పిల్లలకు మించి ఉన్న వారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకుండా చట్టం తీసుకొచ్చారు. జనాభా నియంత్రణలో భాగంగానే ఈ చట్టాల్ని రూపొందించారు.

ట్రెండింగ్ వార్తలు