Dalai Lama: నేడు కాశ్మీర్‌లో పర్యటించనున్న దలైలామా

2020 నుంచి బయటికి వెళ్లని ఆయన, ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో పర్యటన ప్రారంభిస్తున్నారు. అయితే, ఇది వ్యక్తిగత పర్యటన మాత్రమే అని, ఎలాంటి పబ్లిక్ లేదా మత సంబంధమైన కార్యక్రమం కాదని దలైలామా కార్యాలయం తెలిపింది.

Dalai Lama: నేడు కాశ్మీర్‌లో పర్యటించనున్న దలైలామా

Dalai Lama

Dalai Lama: టిబెటన్, బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా జమ్ము-కాశ్మీర్‌తోపాటు లదాఖ్‌లో పర్యటించనున్నారు. గురు, శుక్రవారాల్లో ఆయన పర్యటన సాగనుంది. ఈ రోజు జమ్ము-కాశ్మీర్‌లో పర్యటిస్తారు. రేపు లదాఖ్ వెళ్తారు. కోవిడ్ కారణంగా రెండేళ్లుగా దలైలామా ఎలాంటి పర్యటన చేపట్టలేదు. అధికారిక నివాసమైన ధర్మశాలకే పరిమితమయ్యారు.

Eye Drops: కళ్లద్దాలకు చెక్.. ఐ డ్రాప్స్‌తో మెరుగయ్యే కంటి చూపు

2020 నుంచి బయటికి వెళ్లని ఆయన, ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో పర్యటన ప్రారంభిస్తున్నారు. అయితే, ఇది వ్యక్తిగత పర్యటన మాత్రమే అని, ఎలాంటి పబ్లిక్ లేదా మత సంబంధమైన కార్యక్రమం కాదని దలైలామా కార్యాలయం తెలిపింది. అయితే, దలైలామా వెళ్తున్న రెండు ప్రదేశాలకు సంబంధించి పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనాలతో ఇండియాకు వివాదాలు ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు లదాఖ్ పర్యటన చైనాకు ఆగ్రహం తెప్పించే అవకాశం ఉంది. దలైలామా చైనాకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. టిబెట్‌కు చెందిన దలైలామా ఆ దేశ రాజధానిని చైనా ఆక్రమించడంతో 1959లో అక్కడ్నుంచి తప్పించుకుని ఇండియా వచ్చారు.

Drugs: కాశ్మీర్‌లో డ్రగ్స్ బారిన 52 వేల మంది.. తాజా నివేదికలో వెల్లడి

అప్పట్నుంచి ఇండియాలో శరణార్థిగానే ఉంటున్నారు. ఈ నెల 6న దలైలామా పుట్టిన రోజున ప్రధాని ఆయనకు శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మన దేశంలో దలైలామాతోపాటు 1,60,000 మందికిపైగా టిబెటన్లు నివసిస్తున్నారు. చైనా-ఇండియాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదానికి సంబంధించి ఇరు దేశాల మధ్య ఈ నెల 17న చర్చలు జరుగుతాయి.