Drugs: కాశ్మీర్‌లో డ్రగ్స్ బారిన 52 వేల మంది.. తాజా నివేదికలో వెల్లడి

జమ్మూ-కాశ్మీర్‌లోని పది జిల్లాల్లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన సర్వే ఇది. ఈ సర్వే ప్రకారం.. రాష్ట్రంలో 2.8 శాతం మంది డ్రగ్స్ బారిన పడ్డారు. వీరిలో కొందరు గతంలో డ్రగ్స్ తీసుకుంటే, ఇంకొందరు ఇప్పటీకీ డ్రగ్స్ తీసుకుంటున్నారు.

Drugs: కాశ్మీర్‌లో డ్రగ్స్ బారిన 52 వేల మంది.. తాజా నివేదికలో వెల్లడి

Drugs

Drugs: జమ్మూ-కాశ్మీర్‌లోని జనాభాలో కనీసం 2.8 శాతం మంది డ్రగ్స్ బారినపడ్డట్లు తాజా నివేదిక వెల్లడించింది. దాదాపు 52,404 మంది డ్రగ్స్ తీసుకుంటున్నారని ఈ నివేదిక తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్’ అనే ప్రభుత్వ సంస్థ ఒక సర్వే నిర్వహించి ఈ వివరాల్ని వెల్లడించింది.

Monkeypox: కేరళలో మంకీపాక్స్ కలకలం.. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తిలో రోగ లక్షణాలు

జమ్మూ-కాశ్మీర్‌లోని పది జిల్లాల్లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన సర్వే ఇది. ఈ సర్వే ప్రకారం.. రాష్ట్రంలో 2.8 శాతం మంది డ్రగ్స్ బారిన పడ్డారు. వీరిలో కొందరు గతంలో డ్రగ్స్ తీసుకుంటే, ఇంకొందరు ఇప్పటీకీ డ్రగ్స్ తీసుకుంటున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతే ఎక్కువగా డ్రగ్స్ తీసుకుంటోంది. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో 25.2 శాతం నిరుద్యోగం ఉన్నట్లు అంచనా. డ్రగ్స్ తీసుకుంటున్న వారి సగటు వయసు 22. అలాగే 28 ఏళ్ల వయసు వారు ఎక్కువగా డ్రగ్స్ తీసుకుంటున్నారు. మొత్తం డ్రగ్స్ అలవాటు ఉన్నవారిలో 95 శాతం మంది హెరాయిన్ తీసుకుంటున్నారు. హెరాయిన్ చాలా ఖరీదైంది. సగటున ఒక వ్యక్తి హెరాయిన్ కోసం నెలకు రూ.88,000 వరకు ఖర్చు పెడుతున్నాడు. జమ్మూ-కాశ్మీర్‌లో డ్రగ్స్ వినియోగం కొన్నేళ్లలో 2,000 శాతం పెరిగింది.

Eye Drops: కళ్లద్దాలకు చెక్.. ఐ డ్రాప్స్‌తో మెరుగయ్యే కంటి చూపు

ప్రభుత్వం డ్రగ్స్ వాడేవారికి థెరపీ ఇచ్చేందుకు ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేసింది. 2016లో 489 మంది థెరపీ తీసుకుంటే, 2021లో 10,000 మంది వరకు థెరపీ తీసుకున్నారు. మన దేశంలో పాకిస్తాన్ నార్కో-టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తోంది. దీని ప్రకారం యువతను డ్రగ్స్ వైపు, తీవ్రవాదంవైపు నడిపిస్తోంది. ఈ కారణంగానే ఇక్కడ డ్రగ్స్ తీసుకునే వారి శాతం పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం ఆందోళనకర స్థాయిలో ఉందని అధికారులు అంటున్నారు.