Monkeypox: కేరళలో మంకీపాక్స్ కలకలం.. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తిలో రోగ లక్షణాలు

ఈ ఫలితం వచ్చిన తర్వాతే అతడికి సోకింది మంకీపాక్సా లేదా అనే సంగతి తెలుస్తుందన్నారు. సంబంధిత రోగికి మంకీపాక్స్ లక్షణాలున్నాయి. అతడు విదేశాల్లో ఉన్నప్పుడు మంకీపాక్స్ సోకిన రోగికి దగ్గరగా మెలిగినట్లు తెలిసింది.

Monkeypox: కేరళలో మంకీపాక్స్ కలకలం.. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తిలో రోగ లక్షణాలు

Monkeypox

Monkeypox: కేరళలో మంకీపాక్స్ కేసు కలకలం రేపుతోంది. ఇటీవలే విదేశాల నుంచి వచ్చిన ఒక వ్యక్తి మంకీపాక్స్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడు. కేరళ వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి వీణా జార్జ్ ఈ విషయాన్ని వెల్లడించారు. మంకీపాక్స్ అనుమానిత రోగి నుంచి శాంపిల్స్ సేకరించినట్లు, వాటిని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పరీక్షల కోసం పంపినట్లు ఆమె తెలిపారు.

Nothing: ‘నథింగ్’ ఫోన్ దక్షిణాది కోసం కాదన్న సంస్థ.. మండిపడుతున్న నెటిజన్లు

ఈ ఫలితం వచ్చిన తర్వాతే అతడికి సోకింది మంకీపాక్సా లేదా అనే సంగతి తెలుస్తుందన్నారు. సంబంధిత రోగికి మంకీపాక్స్ లక్షణాలున్నాయి. అతడు విదేశాల్లో ఉన్నప్పుడు మంకీపాక్స్ సోకిన రోగికి దగ్గరగా మెలిగినట్లు తెలిసింది. దీంతో అతడికి ప్రస్తుతం ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. ఇది అంటువ్యాధి. జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. అనేక దేశాల్లో కొద్ది రోజులుగా మంకీపాక్స్ కేసులు నమోదవుతున్నాయి. 1980లో ఈ కేసులు భారీగా నమోదయ్యేవి. ఆ తర్వాత క్రమంగా తగ్గిపోయాయి. అయితే, ఇటీవలి కాలంలో చాలా దేశాల్లో మళ్లీ మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి.

Crocodile: వరద ప్రభావం.. రోడ్డుపైకి కొట్టుకొచ్చిన మొసలి

ఇప్పటివరకు ఇండియాలో మంకీపాక్స్ కేసు నమోదు కాలేదు. ఒకవేళ కేరళ పేషెంట్‌కు మంకీపాక్స్ నిర్ధరణ అయితే, దేశంలో ఇదే తొలి కేసు అవుతుంది. ఇప్పటివరకు అమెరికా సహా 57 దేశాల్లో, 8,200 మంకీపాక్స్ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. రెండు రోజుల క్రితం రష్యాలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. ఇది క్రమంగా ఇతర దేశాలకూ వ్యాపిస్తోంది.