Crocodile: వరద ప్రభావం.. రోడ్డుపైకి కొట్టుకొచ్చిన మొసలి

వీధుల్లో అనేక మొసళ్లు దర్శనమిస్తున్నాయి. తాజాగా ఒక మొసలి వడోదరలో రోడ్డుపైకి కొట్టుకొచ్చింది. స్థానిక విశ్వామిత్ర నది మొసళ్లకు ప్రసిద్ధి. ఇక్కడ వందల సంఖ్యలో మొసళ్లుంటాయి. అయితే, వరదల కారణంగా నది పొంగిపొర్లుతోంది.

Crocodile: వరద ప్రభావం.. రోడ్డుపైకి కొట్టుకొచ్చిన మొసలి

Crocodile

Crocodile: భారీ వర్షాలు, వరదల కారణంగా గుజరాత్‌లోని వడోదరలో మొసళ్లు రోడ్లపైకి కొట్టుకొస్తున్నాయి. వీధుల్లో అనేక మొసళ్లు దర్శనమిస్తున్నాయి. తాజాగా ఒక మొసలి వడోదరలో రోడ్డుపైకి కొట్టుకొచ్చింది. స్థానిక విశ్వామిత్ర నది మొసళ్లకు ప్రసిద్ధి. ఇక్కడ వందల సంఖ్యలో మొసళ్లుంటాయి.

Nothing: ‘నథింగ్’ ఫోన్ దక్షిణాది కోసం కాదన్న సంస్థ.. మండిపడుతున్న నెటిజన్లు

అయితే, వరదల కారణంగా నది పొంగిపొర్లుతోంది. దీంతో నీరు అనేక ప్రాంతాలకు ప్రవహిస్తోంది. ఈ నీళ్లతోపాటే మొసళ్లూ జనావాసాల్లోకి వస్తున్నాయి. బుధవారం కూడా పూజా గార్డెన్ సమీపంలోకి ఒక మొసలి వచ్చింది. దీన్ని గమనించిన స్థానికులు భయాందోళనకు గురై, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అధికారులు అక్కడికి చేరుకుని మొసలిని బంధించి, సురక్షిత ప్రదేశంలో వదిలిపెట్టారు. ఇలా మొసళ్లు నివాస ప్రాంతాల్లోకి వస్తున్న ఘటనలు ఈమధ్య కాలంలో ఎక్కువగా జరగుతున్నాయి.

PM Modi: మోదీ హత్యకు కుట్ర.. బిహార్‌లో ఇద్దరు అరెస్టు

గుజరాత్‌లో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక జిల్లాలు నీట మునిగాయి. అంబిక, పూర్ణ నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. సూరత్-నవ్సారి హైవే మొత్తం నీట మునిగింది. దీంతో ఈ ప్రాంతంలో రవాణా స్తంభించింది. ఈ ప్రాంతంలో ఈ నెల 14 వరకు విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.