Nothing: ‘నథింగ్’ ఫోన్ దక్షిణాది కోసం కాదన్న సంస్థ.. మండిపడుతున్న నెటిజన్లు

ఒక తెలుగు యూ ట్యూబర్‌కు ‘నథింగ్’ కంపెనీ నుంచి ఒక బాక్స్ వచ్చింది. ఫోన్స్ అన్‌బాక్స్ చేసి, రివ్యూ ఇచ్చే ఆ యూట్యూబర్ ఎప్పట్లాగే ఈ ఫోన్‌ను కూడా అన్‌బాక్స్ చేశాడు. అయితే, అందులో ఫోన్ లేదు. ఖాళీ బాక్స్ మాత్రమే ఉంది. దీంతోపాటు ఒక చిన్న లెటర్ కూడా ఉంది.

Nothing: ‘నథింగ్’ ఫోన్ దక్షిణాది కోసం కాదన్న సంస్థ.. మండిపడుతున్న నెటిజన్లు

Nothing

Nothing: కొత్తగా మార్కెట్లోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్ ‘నథింగ్’. మంగళవారం ఈ కొత్త ఫోన్ విడుదలైంది. అయితే, విడుదలకు ముందే ఈ కంపెనీ వివాదంలో చిక్కుకుంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈ ఫోన్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రెండ్రోజులుగా ట్విట్టర్‌లో #DearNothing, #BoycottNothing ట్రెండ్ అవుతూనే ఉంది. దీనికి కారణం.. ఆ సంస్థ వ్యవహరించి తీరే.

Sonia Gandhi: పార్టీ నేతలతో నేడు సోనియా భేటీ.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై చర్చ

ఒక తెలుగు యూ ట్యూబర్‌కు ‘నథింగ్’ కంపెనీ నుంచి ఒక బాక్స్ వచ్చింది. ఫోన్స్ అన్‌బాక్స్ చేసి, రివ్యూ ఇచ్చే ఆ యూట్యూబర్ ఎప్పట్లాగే ఈ ఫోన్‌ను కూడా అన్‌బాక్స్ చేశాడు. అయితే, అందులో ఫోన్ లేదు. ఖాళీ బాక్స్ మాత్రమే ఉంది. దీంతోపాటు ఒక చిన్న లెటర్ కూడా ఉంది. అందులో ఆ ఫోన్ దక్షిణ భారత దేశ ప్రజల కోసం కాదు అని ఇంగ్లీష్‌లో రాసి ఉంది. ఈ మొత్తాన్ని ఆ యూట్యూబర్ వీడియో తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. దీంతో దక్షిణాది ప్రజల్ని కించపరుస్తూ ‘నథింగ్’ వ్యవహరించిన తీరుపై చాలా మంది మండిపడుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలతోపాటు, ఉత్తరాది వారు కూడా సంస్థ తీరును విమర్శిస్తున్నారు. దేశమంతా ఒక్కటే అని, వేర్వేరు ప్రాంతాలుగా చూడటం కరెక్ట్ కాదని కొందరంటున్నారు. ఏ ఉద్దేశంతో కంపెనీ ఇలా చేసిందని ప్రశ్నిస్తున్నారు.

Godavari floods: భ‌ద్రాద్రి వ‌ద్ద గోదావ‌రి 66అడుగులు దాటింది ఎన్నిసార్లో తెలుసా? ఈసారి కొత్త‌ రికార్డు న‌మోద‌వుతుందా?

ఇక దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారైతే కంపెనీని బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. సాధారణంగా కంపెనీలు తమ ఉత్పత్తులు విడుదలయ్యేటప్పుడు కొన్ని రివ్యూ యూనిట్లను యూట్యూబర్స్‌కు పంపుతాయి. అయితే, ‘నథింగ్’ మాత్రం ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారికి మాత్రమే రివ్యూ యూనిట్లు పంపింది. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన టెక్ యూట్యూబర్స్‌కు పంపలేదు. దీంతో ఆయా రాష్ట్రాలకు చెందిన వారంతా ఒక్కటై, కంపెనీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై కంపెనీ ఇంతవరకు స్పందించలేదు.