Godavari floods: భ‌ద్రాద్రి వ‌ద్ద గోదావ‌రి 66అడుగులు దాటింది ఎన్నిసార్లో తెలుసా? ఈసారి కొత్త‌ రికార్డు న‌మోద‌వుతుందా?

భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి 60 అడుగులు దాటి ప్ర‌వ‌హించిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. అయితే 66అడుగులు దాటి గోదార‌మ్మ ప్ర‌వ‌హించింది మాత్రం మూడు సార్లే. 1986 ఆగ‌స్టు 16న 75.6 అడుగుల వ‌ద్ద గోదావ‌రి ప్ర‌వ‌హించి చ‌రిత్ర సృష్టించింది

Godavari floods: భ‌ద్రాద్రి వ‌ద్ద గోదావ‌రి 66అడుగులు దాటింది ఎన్నిసార్లో తెలుసా? ఈసారి కొత్త‌ రికార్డు న‌మోద‌వుతుందా?

Godavari Flood 1

Godavari floods: భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి ఉగ్ర‌రూపం దాల్చుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా వరద పోటెత్తుతోంది. గురువారం ఉద‌యం 7గంట‌ల స‌మ‌యానికి గోదావ‌రి నీటి మ‌ట్టం 60అడుగుల‌కు చేరింది. వ‌ర‌ద ఉధృతి గంట గంట‌కు పెరుగుతున్న క్ర‌మంలో మ‌రికొద్ది గంట‌ల్లో గోదావ‌రి నీటి మ‌ట్టం 62 అడుగుల‌కు చేరుతుంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. వ‌రద ఉధృతి ఇదేస్థాయిలో కొన‌సాగితే సాయంత్రం వ‌ర‌కు 66 అడుగుల‌కు గోదావ‌రి నీటిమ‌ట్టం చేరుతుంద‌ని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ముంపు ప్రాంతాల ప్ర‌జ‌లు బిక్కుబిక్కుమంటున్నారు. భ‌ద్రాచ‌లం, గోదావ‌రి ప‌రిస‌ర ప్రాంతాల ప్ర‌జ‌లు భ‌యంతో వ‌ణికిపోతున్నారు. ఇప్ప‌టికే భ‌ద్రాద్రి వ‌ద్ద రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టిచారు. 45 గ్రామాల ప్ర‌జ‌ల‌ను పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లించారు.

Godavari floods: భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి ఉగ్ర‌రూపం.. గంట గంట‌కు పెరుగుతున్న వ‌ర‌ద ఉధృతి

భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి 60 అడుగులు దాటి ప్ర‌వ‌హించిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. 60 అడుగులు దాటి గోదావ‌రి ప్ర‌వాహం కొన‌సాగింది ఏడు సార్లు. అయితే 66అడుగులు దాటి గోదార‌మ్మ ప్ర‌వ‌హించింది మాత్రం మూడు సార్లే. తొలిసారిగా 1976 జూన్ 22న 63.9 అడుగుల వ‌ద్ద గోదావ‌రి ప్ర‌వ‌హించి రికార్డు క్రియేట్ చేసింది. 1983 ఆగ‌స్టు 14న 63.5 అడుగుల వ‌ద్ద గోదావ‌రి ఉధృతి కొన‌సాగింది. ఈ రెండు రికార్డులు 1986లో క‌నుమ‌రుగ‌య్యాయి. అదే ఏడాది ఆగ‌స్టు 16న 75.6 అడుగుల వ‌ద్ద గోదావ‌రి ప్ర‌వ‌హించి చ‌రిత్ర సృష్టించింది. 1990 ఆగ‌స్టు 24న 70.8 అడుగుల వ‌ద్ద‌, 2006 ఆగ‌స్టు 6న 66.9 అడుగులు, 2013 ఆగ‌స్టు 3న 61.6 అడుగులు, 2020 ఆగ‌స్టు 17న 61.6 అడుగుల వ‌ద్ద గోదావ‌రి ప్ర‌వ‌హించింది.

Godavari Flood: వరద గోదావరి.. వందేళ్లలో తొలిసారిగా..

ఇదిలాఉంటే 1976 నుంచి ఇప్పటివరకు 18 సార్లు మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. తాజాగా గురువారం ఎనిమిదో సారి గోదావరి ప్రవాహం 60 అడుగులు వ‌ద్ద ప్ర‌వ‌హిస్తుంది. ఒక్క జూలై నెలలోనే రెండుసార్లు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయడం ఇదే తొలిసారి అని అధికారులు పేర్కొంటున్నారు.