Godavari floods: భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి ఉగ్ర‌రూపం.. గంట గంట‌కు పెరుగుతున్న వ‌ర‌ద ఉధృతి

భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి ఉగ్ర‌రూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో గోదావ‌రి న‌దికి వ‌ర‌ద పోటెత్తుతోంది. దీంతో గంట గంట‌కు గోదావ‌రి నీటిమ‌ట్టం పెరుగుతోంది. ఉద‌యం 7గంట‌ల స‌మ‌యంలో గోదావ‌రి నీటిమ‌ట్టం 60 అడుగుల‌కు చేరుకుంది. వ‌ర‌ద ఉధృతి ఎక్కువ‌గా ఉండ‌టంతో మ‌రికొన్ని గంట‌ల్లో 62 అడుగుల‌కు చేరుతుంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు.

Godavari floods: భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి ఉగ్ర‌రూపం.. గంట గంట‌కు పెరుగుతున్న వ‌ర‌ద ఉధృతి

Godavari Flood

Godavari floods: భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి ఉగ్ర‌రూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో గోదావ‌రి న‌దికి వ‌ర‌ద పోటెత్తుతోంది. దీంతో గంట గంట‌కు గోదావ‌రి నీటిమ‌ట్టం పెరుగుతోంది. ఉద‌యం 7గంట‌ల స‌మ‌యంలో గోదావ‌రి నీటిమ‌ట్టం 60 అడుగుల‌కు చేరుకుంది. వ‌ర‌ద ఉధృతి ఎక్కువ‌గా ఉండ‌టంతో మ‌రికొన్ని గంట‌ల్లో 62 అడుగుల‌కు చేరుతుంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి గోదావ‌రిలోకి 17,14,848 క్యూసెక్కుల నీరు వ‌చ్చి చేరుతుంది. గోదావ‌రికి వ‌ర‌ద ఉధృతి పెరుగుతుండ‌టంతో భ‌ద్రాచ‌లం వ‌ద్ద అధికారులు హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు.

Godavari Flood: వరద గోదావరి.. వందేళ్లలో తొలిసారిగా..

గోదావ‌రి ప‌రివాహ‌క ప్రాంతాల్లోని 45 గ్రామాల ప్ర‌జ‌ల‌ను పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లించారు. చ‌ర్ల‌, దుమ్ముగూడెం, పిన‌పాక‌, బూర్గంపాడు , అశ్వాపురం, క‌ర‌క‌గూడెం, భ‌ద్రాచ‌లం మండ‌లాల ప‌రిధిలోని ముంపుకు గుర‌య్యే గ్రామాల్లోని సుమారు 4,080 మందిని పున‌రావాస కేంద్రాల‌కు అధికారులు త‌ర‌లించారు. గోదావ‌రి వ‌ర‌ద ఉధృతి గంట‌గంట‌కు పెరుగుతున్న క్ర‌మంలో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. జిల్లా అధికార యంత్రాంగం భ‌ద్రాచ‌లంలోనే మ‌కాం వేసింది. రాత్రిమొత్తం అధికారులు గోదావ‌రి వ‌ర‌ద ఉధృతిని ప‌రిశీలిస్తూ అందుకు త‌గిన విధంగా ముంపు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి నీటిమ‌ట్టం 62అడుగుల‌కు చేరే అవ‌కాశం ఉంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. ఆ మేర‌కు ముంపు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తూ పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లిస్తున్నారు.

Godavari Sub-Rivers : గోదావరికి భారీగా వరద ఉధృతి..ఉగ్రరూపం దాల్చిన ఉపనదులు

ఏలూరు వ‌ద్ద గోదావ‌రికి అనూహ్యంగా వ‌ర‌ద ఉధృతి పెరిగింది. పోల‌వ‌రం వ‌ద్ద 15ల‌క్ష‌ల క్యూసెక్కుల‌కు వ‌ర‌ద‌నీరు చేరింది. అప్ప‌ర్ స్పిల్ వే 35 మీట‌ర్లు, డౌన్ స్పిల్ వే 27 మీట‌ర్ల‌కు న‌మోదైంది. 15ల‌క్ష‌ల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువ‌కు వ‌దులుతున్నారు. వ‌ర‌ద ఉధృతి పెర‌గ‌డంతో కుక్కునూరు, వేలేరుపాడు మ‌డ‌లాల ప‌రిధిలోని ముంపుకు గురైన గ్రామాల ప్ర‌జ‌ల‌ను అధికారులు పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లిస్తున్నారు. అదేవిధంగా ద‌వ‌ళేశ్వ‌రం ప్రాజెక్టు వ‌ద్ద గోదావ‌రి ఉధృతంగా ప్ర‌వ‌హిస్తుంది. బ్యారేజ్ వ‌ద్ద 15.20 అడుగుల‌కు నీటిమ‌ట్టం చేరింది. బ్యారేజ్ 175 గేట్లు ఎత్తి దిగువ‌కు నీటిని విడుద‌ల చేస్తున్నారు. ప్ర‌స్తుతం ధ‌వ‌ళేశ్వ‌రం వ‌ద్ద రెండ‌వ ప్ర‌మాద హెచ్చ‌రిక కొన‌సాగుతోంది. వ‌రద ఉధృతి పెరుగుతుండ‌టంతో ధ‌వ‌ళేశ్వ‌రం వ‌ద్ద మూడో ప్ర‌మాద హెచ్చ‌రిక జారీ చేస్తే అచంట‌, య‌ల‌మంచిలి, పెర‌వ‌ళి మ‌డ‌లాల్లోని ముంపు గ్రామాల ప్ర‌జ‌ల‌ను కూడా పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లిస్తామ‌ని అధికారులు వెల్ల‌డించారు.

Godavari : భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం..చివరి ప్రమాద హెచ్చరిక జారీ

ఇదిలాఉంటే ఏపీ విపత్తుల శాఖ స్పెషల్ సిఎస్ జి.సాయిప్రసాద్, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ లు గోదావ‌రి వ‌ర‌ద ఉధృతిని రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఇప్ప‌టికే సహాయక చర్యల్లో ఏడు ఎన్డీఆర్ఎఫ్, ఐదు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. అల్లూరి జిల్లాలో నాలుగు, అంబేద్కర్ కోనసీమలో మూడు, ఏలూరులో రెండు, తూర్పుగోదావరి లో ఒక‌టి, పశ్చిమగోదావరి లో రెండు బృందాలు ముంపు ప్రాంతాల్లో స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొంటున్నాయి.