Godavari Sub-Rivers : గోదావరికి భారీగా వరద ఉధృతి..ఉగ్రరూపం దాల్చిన ఉపనదులు

ఎడతెరిపిలేని వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదతో ఏజెన్సీ ప్రాంతాలు నీటమునుగుతున్నాయి. రహదారులు, బ్రిడ్జిలపై వరద పోటెత్తింది. గోదావరితో పాటు ఉప నదులూ ఉగ్రరూపం దాల్చాయి. శబరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.

Godavari Sub-Rivers : గోదావరికి భారీగా వరద ఉధృతి..ఉగ్రరూపం దాల్చిన ఉపనదులు

Godavari Flood

Godavari sub-rivers : బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో.. తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. కుండపోత వర్షాలతో గోదావరి నది ఉరకలెత్తుతోంది. భద్రాచలం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాలిపేరు ప్రాజెక్షు నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

అటు శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతోంది. 20 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పోలవరంలో లోయర్‌ కాఫర్ డ్యామ్‌ మునిగిపోయింది. స్విల్‌ వే 48 గేట్ల నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. అటు ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. 175 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

Visakhapatnam : బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం..రెండు రోజులపాటు వర్షాలు

ఎడతెరిపిలేని వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదతో ఏజెన్సీ ప్రాంతాలు నీటమునుగుతున్నాయి. రహదారులు, బ్రిడ్జిలపై వరద పోటెత్తింది. గోదావరితో పాటు ఉప నదులూ ఉగ్రరూపం దాల్చాయి. శబరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఒడ్డున నిలిపిఉంచిన భారీ పడవలూ నీటమునిగే పరిస్థితి నెలకొంది. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

గోదారి ఉగ్రరూపం దాల్చింది. కుండపోత వర్షాలతో ఒక్కసారిగా నదిలో పెరిగిన ప్రవాహం.. ఇప్పుడు పరివాహక ప్రాంతాల్లో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. నాసిక్‌ నుంచి మొదలు పెడితే ధవళేశ్వరం వరకు తన ప్రతాపాన్ని చూపిస్తూ.. ఉరకలెత్తుతోంది. గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్ట్‌లన్ని ఇప్పుడు నిండుకుండను తలపిస్తున్నాయి.

Vegetable Prices: వర్షాల ప్రభావం.. కూరగాయల ధరలు పెరుగుతాయా?

శ్రీరామ ప్రాజెక్ట్‌కు కూడా వరద నీరు పోటెత్తుతోంది. 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయినీటి మట్ట 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 75 టీఎంసీలు నీరు ఉంది. కామారెడ్డిలోని కౌలస్‌ నాలా ప్రాజెక్ట్‌ కూడా నిండు కుండను తలపిస్తోంది. వరదనీటి తాకిడితో క్రమంగా నీటి మట్టం పెరిగింది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1.2 టీఎంసీలు కాగా.. ఇప్పటికే 1.1 టీఎంసీలకు నీటి మట్టం చేరుకుంది.

ఇక పోలవరం, ధవళేశ్వరం వద్ద కూడా గోదావరి తన ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. పోలవరం ప్రాజెక్ట్‌ స్పిల్‌ వే 48 గేట్ల నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే లోయర్‌ కాఫర్ డ్యామ్‌ డయాఫ్రమ్‌ వాల్‌ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. అటు వర్షాలు, ఇటు వరదలతో పోలవరం పనులు నిలిచిపోయాయి. ప్రవాహ ఉధృతి పెరగడంతో బలహీనంగా ఉన్న కట్టలపై అధికారులు దృష్టి సారించారు.

AP Rains : ఏపీలో విస్తారంగా వర్షాలు-నిండుతున్న జలాశయాలు

అటు ధవళేశ్వరం వద్ద కూడా మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. బ్యారేజ్‌కు భారీగా వరద నీరు కొనసాగుతుండటంతో.. 175 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే లంక గ్రామాలను అప్రమత్తం చేశారు. భద్రాచలం వద్ద గోదావరి మట్టం ప్రస్తుతం నీటిమట్టం నిలకడగా ఉంది. 53 అడుగుల వద్ద నీరు ప్రవహిస్తోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.