Eye Drops: కళ్లద్దాలకు చెక్.. ఐ డ్రాప్స్‌తో మెరుగయ్యే కంటి చూపు

కంటి చూపు మెరుగయ్యేందుకు తాజాగా ఐ డ్రాప్స్ డెవలప్ చేశారు అమెరికా శాస్త్రవేత్తలు. రెండు కళ్లలో డ్రాప్స్ వేసుకుంటే చాలు. కంటి చూపు మెరుగవుతుంది. అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) కూడా ఈ డ్రాప్స్‌కు అనుమతించింది.

Eye Drops: కళ్లద్దాలకు చెక్.. ఐ డ్రాప్స్‌తో మెరుగయ్యే కంటి చూపు

Eye Drops

Eye Drops: కంటి చూపు సమస్య ఉంటే కళ్లద్దాలు లేదా కాంటాక్ట్ లెన్స్ వాడాల్సిందే. ఇంకొన్నిసార్లు సర్జరీ కూడా చేయాల్సి ఉంటుంది. అయితే, కంటి చూపు మెరుగయ్యేందుకు తాజాగా ఐ డ్రాప్స్ డెవలప్ చేశారు అమెరికా శాస్త్రవేత్తలు. రెండు కళ్లలో డ్రాప్స్ వేసుకుంటే చాలు. కంటి చూపు మెరుగవుతుంది.

Nothing: ‘నథింగ్’ ఫోన్ దక్షిణాది కోసం కాదన్న సంస్థ.. మండిపడుతున్న నెటిజన్లు

అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) కూడా ఈ డ్రాప్స్‌కు అనుమతించింది. అమెరికాలో ఏ కొత్త ఔషధం మార్కెట్లోకి రావాలన్నా ఎఫ్‌డీఏ అనుమతి తప్పనిసరి. ఇప్పుడు ఎఫ్‌డీఏ అనుమతితో త్వరలోనే ఈ డ్రాప్స్ మార్కెట్లోకి రానున్నాయి. ‘విటీ’ పేరుతో ఈ డ్రాప్స్ తయారు చేశారు. వీటిని ప్రతి రోజూ రెండు కళ్లల్లో వేసుకోవాల్సి ఉంటుంది. డ్రాప్స్ వేసుకున్న 15 నిమిషాల తర్వాత కంటి చూపు మెరుగవుతుంది. దీని ప్రభావం ఆరు గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత కూడా అవసరమైతే మళ్లీ డ్రాప్స్ వేసుకోవాలి. దగ్గరి వస్తువులు సరిగ్గా కనిపించని వారికి ఈ డ్రాప్స్ ఉపయోగపడతాయి. దగ్గరి వస్తువులు మరింత స్పష్టంగా కనిపించేలా చేస్తాయి ఈ డ్రాప్స్.

Monkeypox: కేరళలో మంకీపాక్స్ కలకలం.. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తిలో రోగ లక్షణాలు

40-45 ఏళ్ల వయసు వారికి ఇవి బాగా పనిచేస్తాయని తయారీదారులు అంటున్నారు. దాదాపు 750 మందిపై పరిశోధనలు జరిపి ఈ డ్రాప్స్ తయారు చేశారు. వీటి వాడకం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువగానే ఉన్నాయి అంటున్నారు శాస్త్రవేత్తలు. కొంతమంది పేషెంట్లలో మాత్రం తలనొప్పి, కళ్లు ఎర్రబారడం వంటి లక్షణాలు కనిపించాయి.