‘మట్టిమీద నువ్వు కలిసిన బంధాలన్నీ అబద్దం’ అంటున్న అనసూయ..

‘మట్టిమీద నువ్వు కలిసిన బంధాలన్నీ అబద్దం’ అంటున్న అనసూయ..

Updated On : March 1, 2021 / 6:58 PM IST

Paina Pataaram Song: బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ మాస్ ఆడియెన్స్‌ని మైమరపించడానికి మాంచి మాస్ మసాలా సాంగ్‌లో కనిపించనుంది.
కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా.. అల్లు అరవింద్ సమర్పణలో, జీఏ2 పిక్చర్స్ బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’.. కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు..

Anasuya

ఇటీవల అనసూయ, కార్తికేయలపై చిత్రీకరించిన ‘పైన పటారం’ అనే స్పెషల్ సాంగ్ వీడియో ప్రోమో రిలీజ్ చెయ్యగా రెస్పాన్స్ అదిరిపోయింది. సోమవారం ఫుల్ లిరికల్ సాంగ్ విడుదల చేశారు.. జేక్స్ బిజోయ్ ట్యూన్‌కి సా నా రే ఆకట్టుకునే లిరిక్స్ రాయగా, మంగ్లీ, సాకేత్ కోమండూరి చక్కగా పాడారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.

‘‘పుట్టువేళ తల్లికీ నువ్వు పురిటి నొప్పివైతివి.. గిట్టు వేళ ఆలికేమో మనసు నొప్పివైతివా’’ అంటూ సాగే ఈ పాట అర్థవంతంగా వినసొంపుగా ఉందిజజ
అనసూయ బ్యూటిఫుల్ మూమెంట్స్, కవ్వించే హావభావాలతో కట్టిపడేసింది.. ఆమని, రావు రమేష్, భద్రం తదితరులు నటిస్తున్న ‘చావు కబురు చల్లగా’ చిత్రాన్ని మార్చి 19న విడుదల చెయ్యనున్నారు.