Samuthirakani : సముద్రఖని బర్త్‌డే స్పెషల్.. ‘పంచతంత్రం’లో రామనాథం ఫస్ట్‌లుక్ రిలీజ్..
సముద్రఖని పుట్టినరోజు సందర్భంగా.. పంచతంత్రం సినిమాలో ఆయన ఫస్ట్‌లుక్ విడుదల చేశారు.. ఇందులో ఆయన రామనాథం అనే రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ క్యారెక్టర్ చేస్తున్నారు..

Panchathantram Team Wishes The Versatile Actor And Director Samuthirakani
Samuthirakani: ‘పద్మశ్రీ’ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం ‘పంచతంత్రం’.. టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు నిర్మాతలు. సోమవారం సముద్రఖని పుట్టినరోజు సందర్భంగా… సినిమాలో ఆయన ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. రామనాథం పాత్రలో సముద్రఖని నటిస్తున్నట్టు తెలిపారు.
ఈ సందర్భంగా నిర్మాతలు సృజన్ ఎరబోలు, అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ.. ‘‘సముద్రఖని గారికి జన్మదిన శుభాకాంక్షలు. గొప్ప నటుడు, వ్యక్తి మా సినిమాలో నటించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఓ నటుడిగా ఆయనలో కొత్త కోణాన్ని ఈ సినిమాలో చూస్తారు. సినిమా చిత్రీకరణ చాలావరకూ పూర్తయింది. మరో పది రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశాం’’ అన్నారు.
ఈ చిత్రంతో రచయితగా, దర్శకుడిగా పరిచయమవుతున్న హర్ష పులిపాక మాట్లాడుతూ.. ‘‘పంచేంద్రియాలు చుట్టూ అల్లుకున్న కథతో సినిమా తెరకెక్కిస్తున్నాం. ఇందులో సముద్రఖని గారు రామనాథం అనే రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ ఏడాది ‘క్రాక్’, అంతకు ముందు ‘అల.. వైకుంఠపురములో..’ సినిమాల్లో ఆయన పవర్ఫుల్ విలన్‌గా నటించి మెప్పించారు. మా సినిమాలో సముద్రఖని హీరోగా కనిపిస్తారు. 60 ఏళ్ళ రామనాథం పాత్ర, సినిమా చూస్తున్న ప్రతి యంగ్‌స్టర్‌కి తన తండ్రిని గుర్తు చేసేలా ఉంటుంది’’ అన్నారు.