Bro Movie : మొన్నటిదాకా హైప్ లేదు.. పవన్ ఎంట్రీతో ‘బ్రో’పై పెరిగిన అంచనాలు.. రేపే రిలీజ్..

బ్రో సినిమాలో పవన్ ఉన్నా మొన్నటిదాకా తేజ్, హీరోయిన్స్, డైరెక్టర్ మాత్రమే ప్రమోషన్స్ చేస్తూ వచ్చారు. ఈ సినిమాలో త్రివిక్రమ్ భాగమైనా ప్రమోషన్స్ కి రాలేదు. ప్రమోషన్స్ కూడా భారీగా చేయకుండా సింపుల్ గా చేస్తుండటంతో మొన్నటిదాకా సినిమాపై ఎక్కడా హైప్ లేదు.

Bro Movie : మొన్నటిదాకా హైప్ లేదు.. పవన్ ఎంట్రీతో ‘బ్రో’పై పెరిగిన అంచనాలు.. రేపే రిలీజ్..

Pawan kalyan Sai Dharam Tej Bro Movie Releasing on July 28th hype on Peaks

Updated On : July 27, 2023 / 10:33 AM IST

Bro Movie :  అన్న ఎంట్రీతో బ్రో మీద అంచనాలు స్కై హై రేంజ్ కి వెళ్లిపోయాయి. షూటింగ్ తప్ప ఎటువంటి ప్రమోషన్స్ లో లేని పవన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జాయిన్ అవ్వడంతో సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సాయిధరమ్ తేజ్(sai Dharam Tej) లీడ్ రోల్స్ లో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్రో’ జులై 28 శుక్రవారం రిలీజ్ అవుతోంది. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి అటెండ్ అయిన పవన్ తన స్పీచ్ తో అదరగొట్టారు. అప్పుడెప్పుడో భీమ్లానాయక్ ఈవెంట్ లో ఫ్యాన్స్ తో మాట్లాడిన పవన్ మళ్లీ బ్రో ఈవెంట్ లో మాట్లాడి ఫాన్స్ కి హుషారు తెప్పించారు. బ్రో గురించి ఇంట్రస్టింగ్ విషయాలు షేర్ చేసుకుని సినిమా మీద అంచనాలు పెంచేశారు.

‘బ్రో’లో పవన్ కళ్యాణ్ .. 70 రోజుల్లో చెయ్యాల్సిన షూట్ ని 20 రోజుల్లోనే కంప్లీట్ చేశారు. బ్రో కోసం టైమ్ మేనేజ్మెంట్ చేసి కష్టపడి షూట్ చేసినట్టు చెప్పారు పవన్ కళ్యాణ్. సినిమా పరిశ్రమ ఏ ఒక్కరిదీ కాదని, ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డమన్నారు పవన్. మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి వచ్చినా 10రెట్లు కష్టపడి పనిచేశానంటూ యంగ్ హీరోలకి ఇన్స్పిరేషన్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. సినిమాల గురించి, తన లైఫ్ గురించి.. ఇలా అనేక అంశాలు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడారు పవన్.

బ్రో సినిమాలో పవన్ ఉన్నా మొన్నటిదాకా తేజ్, హీరోయిన్స్, డైరెక్టర్ మాత్రమే ప్రమోషన్స్ చేస్తూ వచ్చారు. ఈ సినిమాలో త్రివిక్రమ్ భాగమైనా ప్రమోషన్స్ కి రాలేదు. ప్రమోషన్స్ కూడా భారీగా చేయకుండా సింపుల్ గా చేస్తుండటంతో మొన్నటిదాకా సినిమాపై ఎక్కడా హైప్ లేదు. ఈ ప్రమోషన్స్ చూసి అభిమానులే నిరుత్సాహపడ్డారు. పవన్ లేకపోవడంతో బ్రో ప్రమోషన్స్ ని పవన్ ఫ్యాన్స్ ని కూడా లైట్ తీసుకున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ రాడేమోనన్న సందేహం కూడా వచ్చింది. కానీ పవన్ రాకపోతే అసలుకే మోసం వస్తుంది, అసలే సినిమాపై హైప్ లేదని నిర్మాతలు కష్టపడి పవన్ ని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రప్పించారు.

Anushka : అనుష్క సినిమా.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.. మళ్ళీ వాయిదా.. నిరాశలో అభిమానులు..

దీంతో రెండు వారాలుగా టీం అంతా ఒక రేంజ్ ప్రమోషన్స్ చేస్తే పవన్ బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి దాదాపు అరగంట మాట్లాడి ఫ్యాన్స్ లో జోష్ నింపి బ్రో సినిమా మీద హైప్ ని ఒక్కసారిగా పెంచారు. దీంతో నిర్మాతలు హమ్మయ్య అనుకున్నారు. ఇక మామా అల్లుళ్ళు కలిసి చేస్తుండటంతో మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి సింపుల్ గా, ఓ రీమేక్ సినిమాగా మొదలైన బ్రో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ హైప్ మీద ఉంది. రేపు థియేటర్స్ వద్ద అభిమానులు సందడి చేయడానికి రెడీ అయిపోయారు.