Petrol Price Hike: మళ్ళీ భగ్గుమన్న పెట్రోల్ ధర.. 9 రోజుల్లో ఇది ఎనిమిదోసారి

మన దేశంలో ఒక వైపు ఎండలు.. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు ఒకదానితో ఒకటి పోటీపడి పెరుగుతున్నాయి.

Petrol Price Hike: మన దేశంలో ఒక వైపు ఎండలు.. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు ఒకదానితో ఒకటి పోటీపడి పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు మరోసారి ప్రకటించాయి . దేశంలోని ప్రధాన చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇవాళ మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. నేడు పెట్రోల్ ధర 80 పైసలు పెరిగింది. గ‌త 9 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఏకంగా 8 సార్లు పెరిగాయి.

Petrol Price Hike: పెట్రోల్ ధరల పెంపు: బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎటాక్

శ‌నివారం చ‌మురు కంపెనీలు పెట్రోల్‌పై 89 పైస‌లు, డీజిల్ పై 86 పైస‌లు పెంచడంతో మొదలైన ఈ వాయింపుడు ప్రతిసారి 80 పైసలు పైన పెంచుతూ వస్తున్నాయి. చమురు కంపెనీల పెంపుకు మళ్ళీ రాష్ట్రాల పన్నులు కలుపుకుంటే ఇది 90 పైసల పైనే ఉంటుంది. తాజాగా పెరిగిన ధరలతో తెలంగాణలో పెట్రోల్ పై 91 పైసలు పెరగగా, డీజిల్ పై 87 పైసలు పెరిగింది. మొత్తంగా పెరిగిన ధరలతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.114.50కు చేరగా.. డీజిల్ రూ.100.69కి చేరింది.

Petrol Price Hike: ఎన్నికలు ముగిశాయి ఇక పెట్రోల్ రేట్లు పెరుగుతాయా?

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా.. ఐదు రాష్ట్రాల ఎన్నికల పుణ్యమా అని రికార్డు స్థాయిలో 137 రోజులు పెట్రోలు, డీజిల్‌ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు కేంద్ర ప్రభుత్వం. అంతర్జాతీయంగా బ్యారెల్ ధర నవంబరులో 82 డాలర్లుగా ఉండగా.. మార్చి ఆరంభంలో 111 డాలర్లకు చేరింది. ఉక్రెయిన్‌, రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత ఓ సమయంలో బ్యారెల్‌ ధర 139 డాలర్లకు కూడా చేరింది. అయినా 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ధరల్లో మార్పులు చేయలేదు. ఎన్నికల అనంతరం గత వారం నుంచి బాదుడు మొదలవగా.. నిపుణుల అంచనా ప్రకారం ధరలు రూ.120-125 వరకు పెరిగే అవకాశం కనిపిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు