Petrol Price Hike: పెట్రోల్ ధరల పెంపు: బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎటాక్

పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు ఎన్నికల వరకు కామా ఉండేదని ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందడంతో.. మోదీ తీసుకొచ్చిన "కాస్ట్లీ దిన్" మళ్లీ తెరపైకి వచ్చిందంటూ కాంగ్రెస్ పార్టీ

Petrol Price Hike: పెట్రోల్ ధరల పెంపు: బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎటాక్

Congress

Petrol Price Hike: దాదాపు ఐదు నెలల తరువాత దేశంలో చమురు ధరలు పెరిగాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలపై పెను భారాన్ని మోపుతోంది. ఈక్రమంలో అధికార పార్టీ పై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టాయి. దేశంలో పెట్రోలు, డీజిల్, గ్యాస్ సిలిండర్ల ధరల పెరుగుదలపై మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన చేసింది. పెట్రోలు, డీజిల్, గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించి కాంగ్రెస్-యుపిఎ హయాంలో ఉన్న ధరలకే పెట్రోల్ డీజిల్ గ్యాస్ అందించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు ఎన్నికల వరకు కామా ఉండేదని ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందడంతో.. మోదీ తీసుకొచ్చిన “కాస్ట్లీ దిన్” మళ్లీ తెరపైకి వచ్చిందంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. బీజేపీ గెలుపుతో, అహంకారం, నిరంకుశత్వం, ఖరీదైన రోజులు వస్తాయని కాంగ్రెస్ విమర్శించింది. ద్రవ్యోల్బణంతో భాజపా పొత్తు పెట్టుకుందంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది.

Also Read: UP: పేదరికంలోను..శిశుమరణాల్లో టాప్‌-3లో యూపీ..ఇది యోగి పాలన అంటూ అఖిలేశ్ యాదవ్ సెటైర్లు

ఎన్నికల సమయంలో యూపీలో అమిత్ షా మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలిచి హోలీకి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేస్తామన్నారని.. ఇప్పుడు ప్రజలు కొనలేనివి ఇస్తున్నారని కాంగ్రెస్ తన ప్రకటనలో పేర్కొంది. మే 2014లో బీజేపీ అధికారం చేపట్టినప్పుడు, పెట్రోల్ ఎక్సైజ్ సుంకం లీటరుకు రూ. 9.20 మరియు డీజిల్‌పై లీటరుకు రూ. 3.46 మాత్రమే ఉందని, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం పెట్రోల్‌పై లీటరుకు రూ. 18.70 మరియు డీజిల్‌పై రూ. 18.34 పెంచిందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఇది తమ యూపీఏ హయాంలో కంటే 203 శాతం నుండి 531 శాతం ఎక్కువగా ఉన్నట్లు కాంగ్రెస్ తన ప్రకటనలో పేర్కొంది. 2014-15 సంవత్సరం నుండి 2021-22 సంవత్సరం వరకు ఎనిమిదేళ్ల మధ్య కాలంలో పెట్రోల్, డీజిల్‌పై పదే పదే పన్నులు పెంచుతూ ఎనిమిదేళ్లలో ప్రజల నుంచి రూ.26 లక్షల కోట్లు కేంద్ర బీజేపీ ప్రభుత్వం వసూలు చేసిందని కాంగ్రెస్ పేర్కొంది.

Also Read:Delhi Police: మైక్రో ఓవెన్‌లో రెండు నెలల పసికందు

22 మార్చి 2020న, రెండేళ్ల క్రితం ఇదే రోజున, పెట్రోల్ రూ. 69.59 మరియు డీజిల్ ధర రూ. 62.29గా ఉండగా ఇవి ప్రస్తుతం రు.96.21, రూ.87.47కి పెరిగాయని కాంగ్రెస్ వివరించింది. కరోనా లాక్ డౌన్ ను అడ్డంపెట్టుకుని పెట్రోలు మరియు డీజిల్ ధరలను పదే పదే పెంచి, ఎక్సైజ్ సుంకం పెంచడం ద్వారా బీజేపీ ప్రజల నుంచి దోచుకుందని కాంగ్రెస్ విమర్శించింది. 2014 మే 26న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారం చేపట్టినప్పుడు భారత్ దిగుమతి చేసుకున్న బ్యారెల్ ముడి చమురు ధర US$ 108 ఉండగా ఆ సమయంలో పెట్రోల్ లీటరుకు రూ. 71.41 డీజిల్ రూ. 55.49 వద్ద అందుబాటులో ఉన్నాయి. అయితే నేడు బ్యారెల్‌ ముడి చమురు ధర US$ 108.25గానే ఉండగా.. పెట్రోల్ మాత్రం రూ. 96.21, డీజిల్ రూ. 87.47 వరకు పెరిగాయి. ముడిచమురు ధరలు అమెరికా డాలర్లతో సమానంగా ఉన్నప్పటికీ పెట్రోలు, డీజిల్ ధరలు రూ.24.80, రూ.31.98 చొప్పున పెరిగాయి. ప్రజలు కష్టపడి సంపాదించుకున్న డబ్బును కేంద్రం దోచుకుంటుందని కాంగ్రెస్ విమర్శించింది.

Also Read: Tamil Nadu : రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకున్నవారికి నగదు బహుమతి : సీఎం స్టాలిన్‌ కొత్త పథకం

సౌదీ అరామ్‌కో సంస్థ ప్రకటించే LPG ధరల ఆధారంగా దేశంలోనూ గ్యాస్ రేట్లు నిర్ణయించబడతాయి. ప్రస్తుతం మెట్రిక్ టన్ను LPG US$769.11 వద్ద ఉంది. ఇది డాలర్-రూపాయి మారకం ద్వారా లెక్కిస్తే కిలో LPG అంతర్జాతీయ ధర రూ.58.37గా ఉంటుంది. ఇదే లెక్కను డొమెస్టిక్ గా 14.2 కిలోల గ్యాస్ సిలిండర్‌ తో లెక్కిస్తే, అది రూ.828.82 అవుతుంది. గ్యాస్ సిలిండర్ ధరపై మోదీ ప్రభుత్వం 5% జిఎస్‌టి, బాటిలింగ్ ఫీజు, ఏజెన్సీ కమీషన్, రవాణా రుసుము వసూలు చేసి, ఆపై కంపెనీల స్వంత లాభాలను పెంచి ఒక్కో సిలిండర్‌కు రూ.949-1100 భారీ మొత్తంలో వసూలు చేస్తుంది.కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2012-2013, 2013-2014 సంవత్సరాలలో LPG యొక్క అంతర్జాతీయ ధర US$ 885.2 మరియు 880.5గా ఉండగా..సాధారణ ప్రజలకు భారీ సబ్సిడీ ద్వారా కేవలం రూ.399-414కే సిలిండర్ పంపిణీ చేసినట్లు కాంగ్రెస్ తన ప్రకటనలో వివరించింది.

Also read:Gas Cylinder : గ్యాస్​ మంటలు – రూ. 50 పెరిగిన సిలిండర్ ధర