Gas Cylinder : గ్యాస్​ మంటలు – రూ. 50 పెరిగిన సిలిండర్ ధర

చమురు సంస్థలు సామాన్యుడిపై కొరడా ఝులిపించడం మొదలు పెట్టాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముగిసిన రెండు వారాల తర్వాత ధరలతో దండెత్తాయి. భారీగా వడ్డిస్తూ సామాన్యుల నడ్డి విరిచే కార్యక్రమం చే

Gas Cylinder : గ్యాస్​ మంటలు – రూ. 50 పెరిగిన సిలిండర్ ధర

Gas Cylinder Price Hike

Updated On : March 22, 2022 / 11:01 AM IST

Gas Cylinder price Hike  : చమురు సంస్థలు సామాన్యుడిపై కొరడా ఝులిపించడం మొదలు పెట్టాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముగిసిన రెండు వారాల తర్వాత ధరలతో దండెత్తాయి. భారీగా వడ్డిస్తూ సామాన్యుల నడ్డి విరిచే కార్యక్రమం చేపట్టాయి.  మంగళవారం  తెల్లారుజామునుంచే పెట్రోల్, డీజిల్‌తో బాదుడు మొదలు పెట్టిన చమురు సంస్థలు… ఓ గంట గ్యాప్‌ తీసుకొని వంటింట్లో సిలిండర్‌ బాంబ్‌ పేల్చి జనాలను బెంబేలిత్తించాయి.

14 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరపై 50 రూపాయలు అదనంగా వడ్డించాయి. దీంతో సిలిండర్ కోసం వెయ్యి రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతేడాది అక్టోబర్ 6 తర్వాత తొలిసారిగా డొమెస్టిక్ సిలిండర్ ధర పెరిగింది. ధరల పెంపుతో తెలంగాణలో సిలిండర్ ధర వెయ్యి రెండు రూపాయలకు పెరగగా.. ఏపీలో వెయ్యి ఎనిమిది రూపాయలకు చేరింది. పెరిగిన ధర నేటి నుంచి అమల్లోకి వచ్చినట్టు చమురు సంస్థలు తెలిపాయి.
Also Read : Petrol, Diesel Price Hike : పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ..హైదరాబాద్ లో ఎంతంటే ….
మరోవైపు 137 రోజుల లాంగ్ గ్యాప్ తర్వాత పెట్రోల్ ధరలు కూడా పెరిగాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 88 పైసలు పెంచాయి. మార్చి 22 ఉదయం ఆరు గంటల నుంచే ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ఇటీవల అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు గరిష్టానికి చేరుకున్నాయి.

కొన్ని నెలలకు ముందు భారత్‌లో చమురు ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై 10 రూపాయలు, డీజిల్‌పై 5 రూపాయల చొప్పున ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది. కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరించి పలు రాష్ట్రాలు సైతం వ్యాట్‌ను తగ్గించాయి. అదే సమయంలో 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దీపావళి ముందు నుంచే పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.
Also Read : Petrol, Diesel Price Hike : పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ఏ వూరులో ఎంత….
అయితే ఇటీవల ఎన్నికలు ముగియడం, రష్యా-యుక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా చమురు సంస్థలు మళ్లీ పెట్రో మోతను మొదలెట్టాయి. ప్రస్తుతం పెంచిన ధరలతో హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర 109 రూపాయల 10 పైసలు, డీజిల్‌ 95 రూపాయల 49 పైసలకు చేరింది.