Maha Shivratri 2026: మహా శివరాత్రి.. ఉపవాసం ఎలా ఉండాలి.. ఏం తినొచ్చు, ఏం తినకూడదు.. శివుడికి ఏమేం సమర్పించొచ్చు..
మహా శివరాత్రి నాడు ఉపవాసం ఉండటం వల్ల శరీరం, మనసును శుద్ధి చేస్తుందని... ఆధ్యాత్మిక అవగాహన పెంచుతుందని నమ్ముతారు.
Maha Shivratri 2026 Representative Image (Image Credit To Original Source)
- ఉపవాసం ఉన్న రోజున త్వరగా నిద్రలేవాలి. స్నానం చేసి కొత్త దుస్తులు ధరించాలి
- నీరు, పాలు, తేనె, గంగా జలంతో శివలింగానికి అభిషేకం చేయాలి
- డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవాలి
- వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి
- సులభంగా జీర్ణమయ్యే ఆహారం, పండ్లు తీసుకోవాలి
Maha Shivratri 2026: శివుడికి అంకితం చేయబడిన ముఖ్యమైన హిందూ పండుగ మహా శివరాత్రి. కశ్మీర్ నుండి తమిళనాడు వరకు దేశం అంతటా భక్తులు ఈ పర్వదినాన్ని ప్రత్యేక ఆచారాలు, ఉపవాసాలు, ప్రార్థనలతో జరుపుకుంటారు. ఈ పర్వదినాన ఉపవాసం ఉండటం, ఆచారాలను పాటించడం చాలా కీలకం. మహా శివరాత్రి వేడుకల్లో పాల్గొనే వారు చేయాల్సిన, చేయకూడని ఏంటో తెలుసుకుందాం..
మహా శివరాత్రి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉంటారు. శివుడిని పూజిస్తారు. శివలింగాన్ని నీళ్లు, పాలతో అభిషేకం చేయడం వంటి ఆచారాన్ని పాటిస్తారు.
మహా శివరాత్రి.. ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే తల స్నానం చేయాలి. రోజంతా ఉపవాసం ఉండాలి. రాత్రంతా జాగరణ చేయాలి. లింగోద్భవ కాల పూజలు చేస్తూ శివనామ స్మరణ చేయాలి. మాంసాహారం, మద్యానికి దూరంగా ఉండాలి. రోజంతా భక్తితో గడపాలి. శివునికి అత్యంత ప్రీతికరమైన మారేడు దళాలతో పూజిస్తూ పంచామృతాలతో అభిషేకం చేస్తే అపారమైన పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
మహా శివరాత్రి 2025: ఉపవాసంలో చేయాల్సినవి, చేయకూడనివి
ఉపవాసానికి ముందు భోజనం: మహా శివరాత్రికి ముందు రోజు భక్తులు ఉపవాసానికి సిద్ధం కావడానికి ముందు భోజనం మాత్రమే తినాలి.
పూజకు ముందు స్నానం: రాత్రంతా పూజ ప్రారంభించే ముందు స్నానం చేయడం చాలా ముఖ్యం.
పూజ సమయం: భక్తులు రాత్రిపూట ఒకసారి లేదా నాలుగుసార్లు శివరాత్రి పూజ చేయవచ్చు.
ఉదయం ఆచారాలు: ఉపవాసం ఉన్న రోజున త్వరగా నిద్రలేవాలి. స్నానం చేసి కొత్త దుస్తులు ధరించాలి. పూర్తి భక్తితో ఉపవాసం ఆచరించడానికి సంకల్పం తీసుకోండి.
నీరు, పాలు, తేనె, గంగా జలంతో శివలింగ అభిషేకం చేయండి.
ప్రార్థనలు చేసేటప్పుడు దీపం వెలిగించి, ధూపం వేయండి.
హైడ్రేటెడ్ గా ఉండండి. శక్తిని కాపాడుకోవడానికి సమతుల్య ఆహారాన్ని తీసుకోండి.
రాత్రి పూజకు ముందు మళ్ళీ స్నానం చేసి, రాత్రిపూట ఒకటి లేదా నాలుగు సార్లు శివపూజ చేయండి.
మరుసటి రోజు ఉదయం స్నానం చేయాలి. తిథి ముగిసే ముందు ఉపవాసం విరమించాలి.
మహా శివరాత్రి 2025: ఉపవాసంలో చేయకూడనివి
శివలింగంపై కొబ్బరి నీళ్ళు సమర్పించ వద్దు.
శివుడికి సమర్పించిన ఏదీ తినకండి. ఎందుకంటే అది అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది.
కేవడ, చంపా వంటి శాపగ్రస్తమైన పువ్వులను సమర్పించకూడదు.
కుంకుమ తిలకం వాడకూడదు.. బదులుగా గంధపు ముద్దను పూయండి.
డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోండి. అధికంగా టీ, కాఫీలు తాగొద్దు.
మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారు ఉపవాసం ఉంటే వారి రక్తంలో చక్కెర స్థాయిలను చెక్ చేసుకుంటూ ఉండాలి.
బాగా వేయించిన ఆహారాలకు దూరంగా ఉండండి. జీర్ణక్రియకు అనుకూలమైన ఆహారమే తీసుకోండి.
పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పెరుగు వంటి ప్రోబయోటిక్స్ తీసుకోండి.
మహా శివరాత్రి 2025: ఉపవాస సమయంలో ఏం తినాలి, ఏమి తినకూడదు..
మహా శివరాత్రి నాడు ఉపవాసం ఉండటం వల్ల శరీరం, మనసును శుద్ధి చేస్తుందని… ఆధ్యాత్మిక అవగాహన పెంచుతుందని నమ్ముతారు. కొంతమంది భక్తులు కఠినమైన వ్రతాన్ని (నీరు కూడా లేకుండా ఉపవాసం) పాటిస్తారు. మరికొందరు ఫలహార వ్రతాన్ని అనుసరిస్తారు. నిర్దిష్ట ఆహారాన్ని తీసుకుంటారు.
మహా శివరాత్రి: ఏం తినాలి?
ఉపవాసం ఉన్న సమయంలో భక్తులు సాత్విక ఆహారం తీసుకోవాలి. పండ్లు, పాలు, కూరగాయలు వంటి ఆహారం మాత్రమే తీసుకోవాలి.
సగ్గుబియ్యం (సాబుదాన), చిరుధాన్యాలు, గుమ్మడికాయ, బంగాళాదుంప, మఖాన, అర్బి, అరటిపండు, పెరుగు
పండ్లు, పాలు, పనీర్, నెయ్యి వంటి పాల ఆధారిత ఉత్పత్తులు
శక్తి పొందేందుకు పొడి పండ్లు, గింజలు, విత్తనాలు
మహా శివరాత్రి: ఏమి తినకూడదు?
గోధుమ, బియ్యం వంటి సాధారణ ధాన్యాలు
పప్పు ధాన్యాలు, చిక్కుళ్ళు, కొన్ని కూరగాయలు
మాంసాహారం, ఉల్లిపాయలు, వెల్లుల్లి
సాధారణ ఉప్పు (బదులుగా రాతి ఉప్పు వాడొచ్చు)
కొబ్బరి నీళ్లు: శివుడికి కొబ్బరికాయలు సమర్పించొచ్చు, కానీ కొబ్బరి నీళ్లు సమర్పించకూడదు.
టీ, కాఫీ వద్దు: ఉపవాసం సమయంలో టీ లేదా కాఫీ అధికంగా తీసుకోవడం మానుకోవాలి. ఇది డీహైడ్రేషన్ కు దారితీస్తుంది.
నిషేధించబడిన పువ్వులు: కేవడ (సువాసనగల మొక్క), చంపా వంటి పువ్వులను సమర్పించకూడదు.
మహా శివరాత్రి.. శివుడికి సమర్పించాల్సిన నైవేద్యాలు
బిల్వ పత్రం, ధాతుర పండు, ముడి బియ్యం, గంధపు చెక్క పేస్ట్
అభిషేకానికి పాలు, పెరుగు, తేనె, కుంకుమపువ్వు, గంగా జలం
బర్ఫీ, పెడ (పేడ-పాలు, పంచదార, నెయ్యితో తయారు చేసే స్వీట్), ఖీర్ వంటి పాల ఉత్పత్తులతో తయారు చేసిన స్వీట్లు
ఈ ఉపవాస నియమాలు, ఆచారాలను పాటించడం ద్వారా భక్తులు మహా శివరాత్రిని అంకితభావం, ఆధ్యాత్మిక క్రమశిక్షణతో ఆచరించొచ్చు.
మహా శివరాత్రి పూజ, ఆచారాలు..
పూజ సమయంలో శివుడికి బిల్వ పత్రం, ధాతుర పండు (ఉమ్మెత్త కాయ), ముడి బియ్యం, పాలు, పెరుగు, గంధపు చెక్క, నెయ్యి, నీరు సమర్పిస్తారు. ఈ నైవేద్యాలు విజయం, శ్రేయస్సు, శాంతిని కలిగిస్తాయని నమ్ముతారు. భక్తులు పాలు, పాల ఉత్పత్తులతో తయారు చేసిన బర్ఫీ, పెడ (పేడ-పాలు, పంచదార, నెయ్యితో చేసే స్వీట్), ఖీర్ వంటి స్వీట్లను కూడా తయారు చేస్తారు.
శివలింగాన్ని పువ్వులు, బిల్వ పత్రాలతో అలంకరిస్తారు. భక్తులు భాంగ్, తేనె, పండ్లు, నెయ్యిని కూడా సమర్పిస్తారు. సాయంత్రం ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. భక్తులు రాత్రంతా శివుడిని ప్రార్థిస్తూ జాగరణ చేస్తారు. శివాలయాల్లో రాత్రి పూట పూజలు చేస్తారు. ఊరేగింపులు నిర్వహిస్తారు.
Also Read: మహా శివరాత్రి.. పూజా సమయం ఎప్పుడు, తప్పకుండా పాటించాల్సిన నియమాలేంటి.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు
NOTE: ఈ విషయాలలో పేర్కొన్న అభిప్రాయాలు, ఆచారాలు పూర్తిగా హిందూ సంప్రదాయాలు, విశ్వాసాలు, సాంస్కృతిక భావనల ఆధారంగా మాత్రమే ఇచ్చాం. కేవలం సమాచారం, సాంస్కృతిక అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. సంపద, దారిద్ర్యం లేదా వ్యక్తిగత ఫలితాల విషయంలో వీటిని సలహాలుగా లేదా హామీగా పరిగణించకూడదు.
