Petrol, Diesel Price Hike : పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ఏ సిటీలో ఎంత…

దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. సుమారుగా పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 88 పైసలు చొప్పన ధరలు పెరిగాయి.  ప్రస్తుతం దేశంలోని వివిధ 

Petrol, Diesel Price Hike : పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ఏ సిటీలో ఎంత…

Petrol, Diesel Price Hike

Updated On : March 22, 2022 / 10:40 AM IST

Petrol, Diesel Price Hike : దేశ ప్రజలపై పెట్రో ధరల భారం మోపుతూ చమురు సంస్ధలు నిర్ణయం తీసుకున్నాయి. దాదాపు ఐదు నెలల తర్వాత చమురు సంస్థలు పెట్రో ధరలు పెంచాయి.  రష్యా, ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల నేపధ్యంలో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో భారత్‌లోనూ  పెట్రో ధరల బాదుడు మొదలైంది.

దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. సుమారుగా పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 88 పైసలు చొప్పన ధరలు పెరిగాయి.  ప్రస్తుతం దేశంలోని వివిధ  ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు   ఈ కింది విధంగా ఉన్నాయి.

ఢిల్లీలో లీటర్
పెట్రోల్ రూ. 96.21(80 పైసలు పెరిగింది),
డీజిల్ రూ. 87.47 (80 పైసలు పెరిగింది)

హైదరాబాద్‌లో 
పెట్రోల్‌రూ.109.10 (90 పైసలు పెరిగింది),
డీజిల్‌ రూ.95.50 (88 పైసలు పెరిగింది)

ముంబైలో
పెట్రోల్ రూ. 110.82 (84 పైసలు పెరిగింది),
డీజిల్ రూ .95.00 (86 పైసలు పెరిగింది)

కోల్‌కతాలో
పెట్రోల్ రూ. 105.51 (84 పైసలు పెరిగింది)
డీజిల్ రూ. 90.62 (83 పైసలు పెరిగింది)

చెన్నైలో
పెట్రోల్ రూ .102.16 (76 పైసలు పెరిగింది)
డీజిల్ రూ. 92.19 (76 పైసలు పెరిగింది)

భోపాల్
పెట్రోల్ రూ.108.11 (77 పైసలు పెరిగింది)
డీజిల్ రూ.91.70 (74 పైసలు పెరిగింది)

విజయవాడ
పెట్రోల్ రూ.110.80 పైసలు
డీజిల్ రూ. 96.83 పైసలు  గా ఉన్నాయి.