Delhi Police: మైక్రో ఓవెన్‌లో రెండు నెలల పసికందు

దక్షిణ ఢిల్లీలో చిరాగ్ దిల్లీ ఏరియాలో దారుణం వెలుగు చూసింది. రెండు నెలల పసికందు మైక్రో వేవ్ లో ఉన్నట్లు గుర్తించారు. సౌత్ డీసీపీ బెనిటా మేరీ జైకర్ పాప మృతి గురించి..

Delhi Police: మైక్రో ఓవెన్‌లో రెండు నెలల పసికందు

Delhi Police

Delhi Police: దక్షిణ ఢిల్లీలో చిరాగ్ దిల్లీ ఏరియాలో దారుణం వెలుగు చూసింది. రెండు నెలల పసికందు మైక్రో వేవ్ లో ఉన్నట్లు గుర్తించారు. సౌత్ డీసీపీ బెనిటా మేరీ జైకర్ పాప మృతి గురించి సాయంత్రం 3గంటల 15నిమిషాలకు సమాచారం అందుకున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి హంతకులను పట్టుకునే పనిలో ఉన్నామని పోలీసులు తెలిపారు.

శిశువు పేరెంట్స్ గుల్షాన్ కౌశిక్, డింపుల్ కౌశిక్ లను పోలీస్ స్టేషన్లో విచారణ జరుపుతున్నట్లు సమాచారం. దర్యాప్తు కొనసాగుతుందని జైకర్ అన్నారు.

ప్రాథమిక విచారణలో పసికందును తల్లి హతమార్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆడపిల్ల పుట్టిందని అసంతృప్తి వ్యక్తం చేస్తుండటాన్ని కారణంగా భావిస్తున్నారు. ‘2022 జనవరిలో అనన్య పుట్టినప్పటి నుంచి తల్లి అసంతృప్తితోనే ఉంది. ఈ విషయంపై భర్తతో కూడా పలుమార్లు గొడవపడింది. వీరికి నాలుగేళ్ల కొడుకు కూడా ఉన్నాడు’ అని పోలీసులు చెబుతున్నారు.

Read Also : గర్భిణీ ఉరివేసుకుని ఆత్మహత్య.. అదనపు కట్నం కోసం భర్త వేధింపులు?

పసికందు చనిపోయిందని స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పసికందు తల్లి ఇంటి లోపలి నుంచి లాక్ వేసుకుని భర్త తల్లి (అత్త) కేకలు పెట్టిన పట్టించుకోలేదు.

‘గది అద్ధం పగులగొట్టి లోపలికి వెళ్లాం. మహిళ కొడుకుతో సహా అపస్మారక స్థితిలో పడి ఉంది. రెండు నెలల వయస్సున్న అనన్య కనిపించలేదు’ అని స్థానికులు చెబుతున్నారు.

అనన్య అమ్మమ్మ, కొందరు పొరుగువారు కలిసి మైక్రోవేవ్ ఓవెన్ ఓపెన్ చేసి చూశారు. అదే ఇంట్లో రెండో గదిలో ఉన్న సెకండ్ ఫ్లోర్ లో ఉన్న ఓపెన్ లో పసికందు విగత జీవిగా కనిపించింది. ఘటన జరిగిన సమయంలో పసికందు తండ్రి సమీపంలోనే తాను నిర్వహిస్తున్న కిరాణా షాపులో ఉన్నాడని పోలీసులు అంటున్నారు.