Petrol Price Hike: ఎన్నికలు ముగిశాయి ఇక పెట్రోల్ రేట్లు పెరుగుతాయా?

ఎన్నికలు ముగియడంతో పెట్రోల్ ధరలు పెంచే యోచనలో ఆయిల్ కంపెనీలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Petrol Price Hike: ఎన్నికలు ముగిశాయి ఇక పెట్రోల్ రేట్లు పెరుగుతాయా?

Petrol

Petrol Price Hike: దేశంలో మళ్లీ పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయా? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో గత నవంబర్ నుంచి ఇప్పటివరకు దేశంలో పెట్రోల్ ధరలు పెంచలేదు. ఎన్నికలు ముగియడంతో పెట్రోల్ ధరలు పెంచే యోచనలో ఆయిల్ కంపెనీలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈమేరకు శుక్ర, శనివారాల్లో చమురు సంస్థల నుంచి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అంతర్జాతీయంగా నెలకొన్న సంక్షోభం కారణంగా ఇప్పటికే క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 110 – 119 వద్ద ట్రేడ్ అవుతుంది. ఈక్రమంలో భారత్ లోని చమురు సంస్థలపై ఆర్ధిక భారం పడుతుంది.

Also read: AP Budget 2022-23 : ఏపీ బడ్జెట్ 2022-23.. శాఖల వారీగా కేటాయింపులు

రష్యా యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో సమస్య మరింత జఠిలం అవుతుండగా.. అంతర్జాతీయంగా చమురు రేట్లు భారీగా పెరిగిపోయాయి. దీంతో దేశంలో పెట్రోల్ డీజిల్ పై రూ. 15 – 22 రూపాయల మేర పెరుగుదల ఉండే అవకాశం ఉన్నట్లు ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నా భారత్ లో మాత్రం రేట్లు పెరిగే అవకాశం ఉండకపోవచ్చని, ప్రత్యామ్న్యాయాలపై ద్రుష్టి పెట్టి భారం తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు మూడు రోజుల క్రితం జరిగిన ఓ సమావేశంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. అయితే అంతర్జాతీయంగా చమురు ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో దేశంలోనూ ఆ ప్రభావం ఉంటుందని కూడా ఆమె పేర్కొన్నారు.

Also read: Covid Vaccine: బూస్టర్ డోసుగా భారత్ బయోటెక్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ పై ట్రయల్స్ షురూ

చమురు ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం నవంబర్ 4, 2021న ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున సుంకాన్ని తగ్గించడంతో ఇంధన ధరలు గణనీయంగా తగ్గాయి. కేంద్ర ప్రభుత్వన్ని అనుసరించి ఇతర రాష్ట్రాలు కూడా పెట్రోల్ మరియు డీజిల్ ధరలపై వ్యాట్‌ని తగ్గించాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమంటు ప్రతిపక్షాలు భావించినా..ప్రస్తుతం ఎన్నికలు ముగిసి, బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతన్న నేపథ్యంలోనూ దేశంలో పెట్రోల్ ధరల పెంపు ఏమాత్రం ఉంటుందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

Also read: Final Election Results : ఇది బీజేపీ దండయాత్ర.. 5 రాష్ట్రాల ఎన్నికల ఫైనల్ రిజల్ట్స్ ఇవే..