Pfizer Vaccine: 12 నుంచి 15 ఏళ్ల వారికి ఫైజర్ వ్యాక్సిన్.. ఎక్కడంటే?
ప్రపంచమంతా ఇప్పుడు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంది కోవిడ్ వ్యాక్సిన్. ఇప్పటికే వచ్చిన వ్యాక్సిన్లను ప్రజలుకు చేర్చడంతో పాటు కొత్త వ్యాక్సిన్లు, వాటి సామర్ధ్యాల మీదనే ప్రపంచ వైద్య నిపుణుల దృష్టి ఉంది.

Pfizer Vaccine
Pfizer Vaccine: ప్రపంచమంతా ఇప్పుడు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంది కోవిడ్ వ్యాక్సిన్. ఇప్పటికే వచ్చిన వ్యాక్సిన్లను ప్రజలుకు చేర్చడంతో పాటు కొత్త వ్యాక్సిన్లు, వాటి సామర్ధ్యాల మీదనే ప్రపంచ వైద్య నిపుణుల దృష్టి ఉంది. ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు ఏవీ కూడా 16 ఏళ్ల చిన్న పిల్లలకు అందించేవిగా ఆమోదం పొందలేదు. ఈ మధ్యనే ఫైజర్ వ్యాక్సిన్ 12 నుండి 16 ఏళ్ల మధ్య వారికి కూడా అందించేవిధంగా యూరోపియన్ యూనియన్ దేశాల్లో అనుమతి పొందింది. మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ) సలహా కమిటీ సిఫార్సుల మేరకు అప్పుడు వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఈయూ ఆమోదం తెలిపింది.
కాగా.. ఇప్పుడు బ్రిటన్‌కు చెందిన మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రోడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ కూడా పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు అంగీకరించింది. 12 నుంచి 15 ఏళ్ల వయసు పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్‌కు MHPRA శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కఠినమైన సమీక్ష నిర్వహించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏజెన్సీ చీఫ్ జూన్ రెయిన్ వెల్లడించగా.. యురోపియన్ యూనియన్, అమెరికాల్లోనూ ఇలాంటి పరీక్షలు నిర్వహించగా అన్నిటిలో కూడా దుష్ప్రభావాలు ఉన్నట్లుగా తేలలేదని ప్రకటించారు.
12 నుంచి 15 ఏళ్ల పిల్లలపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్ డేటాను క్షుణ్నంగా పరిశీలించగా.. ఫైజర్-బయోఎన్‌టెక్ కొవిడ్ వ్యాక్సిన్ ఈ వయసు పిల్లలకు పూర్తి సురక్షితమని గుర్తించామని జూన్ రెయిన్ తెలిపారు. స్వల్పంగా దుష్ప్రభావాలు కనిపించినా.. వాటి కన్నా పిల్లలకు ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వలనే అధికంగా ఫలితాలు ఉన్నాయని అత్యవసర వినియోగంలో భాగంగా ఫైజర్ వ్యాక్సిన్ 12 నుండి 15 ఏళ్ల పిల్లలకు కూడా ఇవ్వవచ్చని తెలిపారు. దీంతో యురోపియన్ యూనియన్, అమెరికాతో పాటు బ్రిటన్ లో కూడా ఫైజర్ పిల్లలకు అందనుంది.