Uttar Pradesh : రీల్ కోసం పెళ్లికూతురు చేసిన పనికి పోలీసుల భారీ జరిమానా

పెళ్లిళ్ల సమయంలో వైరల్ అవ్వడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. పెళ్లికూతురు, పెళ్లికొడుకు చేసే హంగామా సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. రీసెంట్‌గా ఓ పెళ్లికూతురు పెళ్లిబట్టల్లో అందంగా ముస్తాబై కారు పైన కూర్చుని రీల్ చేసింది. భారీ జరిమానా చెల్లించింది.

Up bride viral video : పెళ్లిళ్లు అయినా.. బర్ట్ డే పార్టీలు అయినా.. జరిగే కార్యక్రమం ఏదైనా రీల్స్ చేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఓ వధువు పెళ్లిబట్టలతో కారుపైన కూర్చుని రీల్ చేసింది. పోలీసులకు భారీ ఫైన్ కట్టింది.

Anushka Sharma : అనుష్క, అమితాబ్ బైక్ రైడ్.. ముంబై పోలీసులు ఫైన్‌.. జరిమానా ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

ఏదో ఒకటి చేసి జనాల్ని తమవైపుకి తిప్పుకోవాలనే ఆరాటం చాలామందిలో ఉంది. ఇక పెళ్లిళ్లలో కూడా ప్రతీ సందర్భాన్ని రీల్స్ చేసి వైరల్ చేస్తున్నారు. రీసెంట్‌గా ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌కు చెందిన పెళ్లికూతురు తన పెళ్లిరోజున ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ పోస్ట్ చేయాలనుకుంది. పెళ్లి దుస్తులతో అందంగా తయారైన వధువు కారు ముందరి భాగంపైన కూర్చుని కెమెరాకు ఫోజులు ఇచ్చింది. పబ్లిక్‌లో ఇలాంటి ఫీట్లు చేయాలంటే సాహసమనే చెప్పాలి. sachkadwahai అనే యూజర్ ఐడీ ద్వారా ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇదంతా బాగానే ఉంది. కానీ భద్రతా నియమాలను ఉల్లంఘిస్తే ట్రాఫిక్ పోలీసులు ఊరుకుంటారా? కొత్త పెళ్లికూతురికి 15,000 రూపాయలు జరిమానా విధించారు.

Assam Police : అస్సాం పోలీసులు షేర్ చేసిన ఫోటో వెనుక ఇంత అర్ధం ఉందా?

‘సింపుల్ గా పెళ్లిళ్లు చేసుకునే రోజులు పోయాయని’.. ‘ఇంత ఫేమస్ అయినా వధువుకి ఈ జరిమానా సరిపోదని నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ఫేమస్ అవ్వాలనే కోరిక ఉంటే ఫైన్ కట్టే స్థోమత కూడా ఉండాలి. ఇలాంటి సీన్స్ రిపీట్ కాకూడదని కాబోలు పోలీసులు వదువుకి భారీగానే ఫైన్ వేశారు.

ట్రెండింగ్ వార్తలు