Anushka Sharma : అనుష్క, అమితాబ్ బైక్ రైడ్.. ముంబై పోలీసులు ఫైన్‌.. జరిమానా ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

ముంబై ట్రాఫిక్ నుంచి తప్పించుకోడానికి బైక్ రైడ్ చేసిన అనుష్క, అమితాబ్ కు ముంబై పోలీసులు ఫైన్‌ వేశారు. ఆ ఫైన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.

Anushka Sharma : అనుష్క, అమితాబ్ బైక్ రైడ్.. ముంబై పోలీసులు ఫైన్‌.. జరిమానా ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

Mumbai Police fined Amitabh Bachchan and Anushka Sharma to bike ride

Amitabh Bachchan : ఇటీవల ముంబైలో ట్రాఫిక్ (Traffic) సమస్య తీవ్ర ఇబ్బందికరంగా మారింది. దాని వల్ల సాధారణ ప్రజల నుంచి సినిమా స్టార్స్ వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఈ ట్రాఫిస్ నుంచి తప్పించుకోడానికి పలువురు బాలీవుడ్ స్టార్స్ మెట్రోని (Metro) ఉపయోగిస్తుంటే, మరికొందరు బైక్ రైడ్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సారా అలీఖాన్, హేమ మాలిని, నవాజుద్దీన్ వంటి స్టార్స్ మెట్రోలో ప్రయాణం చేసి వారి అనుభూతుని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Niharika Konidela : వరుణ్, లావణ్య ఎంగేజ్‌మెంట్‌.. మీడియాకి నిహారిక సమాధానం..

ఇక తాజాగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ షూటింగ్ కి వెళ్తూ ముంబైలో ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాడు. అయితే బాగా లేటు అవుతుండడంతో కారు దిగేసి ఓ బైకర్ ని లిఫ్ట్ అడిగి షూటింగ్ కు వెళ్లారు. తనకి లిఫ్ట్ ఇచ్చిన బైకర్ కు థాంక్యూ చెబుతూ అమితాబ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తరువాత అమితాబ్ ని స్ఫూర్తిగా తీసుకోని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ షూటింగ్ కు వెళ్లేందుకు బైక్ ని సెలెక్ట్ చేసుకుంది. తన బాడీగార్డ్ తో బైక్ మీద అనుష్క షూటింగ్ సెట్స్ కి చేరుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యింది.

NTR30 : ఫస్ట్ లుక్ అప్డేట్ ఇచ్చిన కళ్యాణ్ రామ్.. బర్త్ డేకి గిఫ్ట్ రెడీ!

ఇక రెండు పోస్ట్ లను చూసిన కొందరు నెటిజెన్స్ ముంబై పోలీసులను (Mumbai Police) ట్యాగ్ చేస్తూ.. హెల్మెట్స్ లేకుండా బైక్ రైడ్ చేస్తున్నారు. మాకేనా రూల్స్, సెలబ్రిటీలకు లేవా అని పోస్టులు వేశారు. తాజాగా వీటికి ముంబై పోలీసులు ఆన్సర్ ఇచ్చారు. ట్రాఫిక్ రూల్స్ ప్రకారం అమితాబ్ కి రూ.1000, అనుష్కకి రూ.10500 జరిమానా వేసినట్లు, ఆ ఫైన్స్ ని కూడా వారు చెల్లించేసినట్లు రసీదులు చూపిస్తూ ట్వీట్ చేశారు. అయితే అనుష్కకు 10500 రూపాయిలు జరిమానా ఎందుకు వేసారో అని అందరు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.