Niharika Konidela : వరుణ్, లావణ్య ఎంగేజ్‌మెంట్‌.. మీడియాకి నిహారిక సమాధానం..

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్‌ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా దీని గురించి నిహారికని ప్రశ్నించగా..

Niharika Konidela : వరుణ్, లావణ్య ఎంగేజ్‌మెంట్‌.. మీడియాకి నిహారిక సమాధానం..

Niharika Konidela Comments on Varun Tej Lavanya Tripathi engagement

Updated On : May 17, 2023 / 8:53 PM IST

Varun Tej – Lavanya Tripathi : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్నాడంటూ, కొంతం కాలంగా డేటింగ్ లో ఉన్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలు గురించి వారిద్దరూ కూడా ఇప్పటి వరకు రెస్పాండ్ అవ్వలేదు. తాజాగా వీరిద్దరూ పెళ్ళికి సిద్ధమయ్యారని, నిశ్చితార్థం చేసుకోబోతున్నారని టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తుంది. ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియక మెగా అభిమానులంతా తికమకలో పడ్డారు. తాజాగా ఈ విషయం గురించి నిహారికని ప్రశ్నించారు మీడియా విలేకర్లు.

Bholaa Shankar : ఇంద్ర లొకేషన్స్‌లో భోళా శంకర్ సాంగ్ షూటింగ్.. మరో దాయి దాయి దామ్మా!

నిహారిక తను నటించిన ‘డెడ్ పిక్సెల్’ (Dead Pixels) వెబ్ సిరీస్ ప్రమోషన్ లో ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక మీడియా ఇంటరాక్షన్ లో పాల్గొన్న నిహారికను వరుణ్ తేజ్ పెళ్లి గురించి ప్రశ్నించారు. దానికి నిహారిక బదులిస్తూ.. “నేను ఇప్పుడు దాని గురించి మాట్లాడాలని అనుకోవడంలేదు. ప్రస్తుతం డెడ్‌ పిక్సెల్స్‌ గురించి చర్చిస్తున్నాం. కాబట్టి దాని గురించి మాత్రమే మాట్లాడండి” అంటూ వ్యాఖ్యానించింది. దీంతో వరుణ్ లావణ్య ఎంగేజ్‌మెంట్‌ ఇంకా ప్రశ్నగానే ఉండిపోయింది. కాగా నాగబాబు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ పెళ్లి ఈ ఏడాదిలోనే ఉండబోతుందని చెప్పిన విషయం తెలిసిందే.

Upasana : నేను వారసత్వాన్ని కొనసాగించాలని బిడ్డని కనడం లేదు.. ఉపాసన వైరల్ పోస్ట్!

తను చేసుకోబోయే అమ్మాయిని వరుణ్ బాబే ప్రకటిస్తాడు అంటూ నాగబాబు పేర్కొన్నాడు. మరి ఈ మెగా హీరోని మనువాడే వధువు ఎవరో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. కాగా వరుణ్ తేజ్ అండ్ లావణ్య త్రిపాఠి మిస్టర్, అంతరిక్షం అనే రెండు సినిమాల్లో కలిసి చేశారు. ప్రస్తుతం వరుణ్ తేజ్.. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో ‘గాండీవధారి అర్జున’, శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్షన్ లో VT13 ని తెరకెక్కిస్తున్నాడు. ఈ రెండు సినిమాలను ఏకకాలంలో తెరకెక్కిస్తున్నాడు వరుణ్ తేజ్.