Assam Police : అస్సాం పోలీసులు షేర్ చేసిన ఫోటో వెనుక ఇంత అర్ధం ఉందా?

ఆన్ లైన్ భద్రతపై అవగాహన కల్పించేందుకు అస్సాం పోలీసులు క్రియేటివ్‌గా ఆలోచించారు. ట్విట్టర్‌లో అస్సాం పోలీస్ డిపార్ట్ మెంట్ పోస్ట్ చేసిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. పోలీసుల క్రియేటివిటీని జనం మెచ్చుకుంటున్నారు.

Assam Police : అస్సాం పోలీసులు షేర్ చేసిన ఫోటో వెనుక ఇంత అర్ధం ఉందా?

Assam Police

Assam Police :  ఆన్ లైన్ భద్రత గురించి అవగాహన కల్పించేందుకు అస్సాం పోలీసులు చాలా క్రియేటివ్‌గా ముందుకు వచ్చారు. డిపార్ట్‌మెంట్ లోగోతో పాటు నీలి ఆకాశంలో యారో గుర్తు ఉన్న ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Rajamouli : సైబర్ నేరాలపై రాజమౌళి ప్రత్యేక క్లాస్‌లు.. పోలీసులను డౌట్స్ అడిగిన దర్శక ధీరుడు

అస్సాం పోలీసులు ఆన్ లైన్ సేఫ్టీ విషయంలో జాగ్రత్తగా ఉండేందుకు క్రియేటివ్ మెసేజ్‌ను పోస్ట్ చేశారు. పోలీస్ డిపార్ట్‌మెంట్ షేర్ చేసిన ఫోటోలో నీలి ఆకాశం, డిపార్ట్ మెంట్ లోగోతో పాటు కిందకు చూపిస్తూ బాణం గుర్తు కనిపిస్తుంది. అది ALTబ్యాడ్జ్ సూచిస్తుంది. దానిని క్లిక్ చేస్తే పూర్తి ఇమేజ్ కనిపిస్తుంది. అనసవరమైన లింక్‌లు క్లిక్ చేయవద్దని వినియోగదారులను హెచ్చరిస్తూ “క్లిక్ చేసే ముందు ఆలోచించండి” అంటూ సైబర్ భద్రతపై వీరు చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Stay Safe Online Campaign : స్టే సేఫ్ ఆన్‌లైన్ క్యాంపెయిన్.. సైబర్ మోసాల నుంచి సేఫ్‌గా ఉండాలంటే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పక తెలుసుకోండి!

“ALT”అనే పదం ఇమేజ్ డీటెయిల్స్ సూచించడానికి ట్విట్టర్ లో ఉపయోగిస్తారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. పోలీసుల క్రియేటివిటీని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. అస్సాంలో ఎక్కువమంది ఫేస్ బుక్ యూజర్లు ఉన్నారు. ఇది ఎక్కువమందికి రీచ్ కావడానికి పోస్ట్ చేసి ఉంటారని జనం అభిప్రాయపడుతున్నారు.