Prabhas Salaar: సలార్ లో శృతిహాసన్ పాత్ర ఇదేనా?
దాదాపు మూడేళ్ల విరామం తరువాత క్రాక్ సినిమాతో మళ్లీ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది శృతిహాసన్. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా అటు కోవిడ్ తర్వాత ఈ సంక్రాంతికి విడుదలై అనూహ్య విజయాన్ని సాధించడమే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి శృతి కెరీర్‌కి మరింత బూస్టప్ ఇచ్చింది.

Prabhas Salaar
Prabhas Salaar: దాదాపు మూడేళ్ల విరామం తరువాత క్రాక్ సినిమాతో మళ్లీ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది శృతిహాసన్. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా అటు కోవిడ్ తర్వాత ఈ సంక్రాంతికి విడుదలై అనూహ్య విజయాన్ని సాధించడమే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి శృతి కెరీర్‌కి మరింత బూస్టప్ ఇచ్చింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వున్న శృతిహాసన్ వరస సినిమాలకు ఒకే చెప్పేస్తుంది. క్రాక్ తర్వాత మూడేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ వకీల్ సాబ్ లో జోడీ కట్టగా అది శృతికి పెద్దగా కలిసి రాలేదు. కానీ అవకాశాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి.
క్రాక్, వకీల్ సాబ్ మూవీల తరువాత శృతి మరో బంపర్ ఆఫర్‌ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ సలార్ మీద ఇప్పటికే భారీస్థాయి అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. అలాంటి క్రేజీ ప్రాజెక్టులో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో ప్రభాస్ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడని ప్రచారం జరుగుతుండగా ఒక పాత్రకు జోడిగా శృతి హాసన్ నటించనుంది.
సలార్ లో శృతి పాత్ర నిడివి తక్కవ సమయమే ఉండగా ఇది సినిమాలో కీలక మలుపు తిప్పే పాత్ర కాబోతుందట. ఇంతకీ శృతి ఏ పాత్రలో నటిస్తుందట జర్నలిస్ట్ పాత్రని చెప్తున్నారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్రలో శృతి మలుపుతిప్పే సన్నివేశాల్లో కనిపిస్తుందట. గతంలో కూడా ఈ చెన్నై చంద్రం సూర్య నటించిన సింగం-3లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా కనిపించింది. కాగా ఇప్పుడు మరోసారి అదే తరహా పాత్రలో కనిపించనుంది. మైనింగ్ మాఫియా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ప్రభాస్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు.
Read: Shankar-Ram Charan Movie: ఓ పవర్ ఫుల్ పాత్ర కోసం శంకర్ స్టార్స్ వేట!