Prabhas Upcoming Films: ప్రభాస్ డేట్స్ అంటే.. యంగ్ దర్శకులకు అందని ద్రాక్షపళ్లే!
నేషనల్ లెవెల్ మార్కెట్.. భారీ స్టార్ డం.. ఆరడుగుల కటౌట్.. సూపర్ హీరోను తలపించే ఫిజిక్. ప్రభాస్ తో సినిమా చేయాలని ఏ దర్శకుడికి ఉండదు. స్టార్ దర్శకుల నుండి రాబోయే కొత్త దర్శకుల వరకు ప్రభాస్ ఇప్పుడు కలల హీరోనే.

Prabhas Upcoming Films
Prabhas Upcoming Films: నేషనల్ లెవెల్ మార్కెట్.. భారీ స్టార్ డం.. ఆరడుగుల కటౌట్.. సూపర్ హీరోను తలపించే ఫిజిక్. ప్రభాస్ తో సినిమా చేయాలని ఏ దర్శకుడికి ఉండదు. స్టార్ దర్శకుల నుండి రాబోయే కొత్త దర్శకుల వరకు ప్రభాస్ ఇప్పుడు కలల హీరోనే. ఏ ముహూర్తాన బాహుబలి విడుదలైందో దెబ్బకు మన హీరో భవిష్యత్ మొత్తం మారిపోయింది. వెంటనే వచ్చిన సాహోను కూడా పాన్ ఇండియన్ లెవల్ లో మార్పులు చేయాల్సి వచ్చింది. ప్రభాస్ నుండి ఇక వచ్చే.. రాబోయే సినిమాలు కూడా అన్నీ అదే స్థాయి సినిమాలే.
ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధేశ్యాం’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తికాకపోగా అదే సమయంలో ఓంరౌత్ దర్శకత్వంలో ‘ఆది పురుష్’ కూడా మొదలుపెట్టాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఆదిపురుష్ షూటింగ్ వాయిదా పడింది. ఇక రాధేశ్యాం పూర్తిచేసి ఆదిపురుష్ తో పాటు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ కూడా మొదలుపెట్టనున్నాడు. ఈ మూడు సినిమాల తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్, సిద్ధార్థ్ ఆనంద్ తో మరో పాన్ ఇండియా సినిమాకు ఒకే చెప్పాడు.
మొత్తం మీద ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ఐదు సినిమాలున్నాయి. ఇందులో నాలుగు సినిమాలు అసలు షూటింగ్ మొదలు కానట్లే లెక్క. ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కే సినిమాలే కాగా ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలకు సెట్స్, సీజీ వర్క్స్ కోసమే టైంతో పాటు భారీ బడ్జెట్ పెట్టనున్నారు. అంటే మొత్తం మీద ఈ నాలుగు సినిమాలు పూర్తయ్యేసరికి ఐదారేళ్ళు పడుతుంది. అన్నీ కలిసొస్తే రాధేశ్యాం ఈ ఏడాది విడుదల కానుండగా వచ్చే ఏడాది నుండి వరసగా సినిమాలు విడుదల చేసే అవకాశం ఉంటుంది.
ప్రభాస్ ఒకే చెప్పిన సినిమాలను బట్టి చూస్తే మరో ఐదేళ్ల పాటు ప్రభాస్ డేట్స్ ఖాళీలేవు. దీంతో ఆయనకు కథ చెప్పాలన్నా కూడా దర్శకులకు చిక్కడం లేదని వినిపిస్తుంది. ఒకవేళ కథ నచ్చి మధ్యలో అవకాశం ఇస్తాడన్న ఆశలు కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ఒప్పుకున్న దర్శకులందరూ ఉద్దండులే.. కథలన్నీ భారీ స్థాయి పాన్ ఇండియా సినిమాలే. సో.. సీనియర్ దర్శకులకు కూడా చిక్కని ప్రభాస్ ఇప్పుడు ఇక యంగ్ దర్శకులకు దొరకడం అంటే అసాధ్యమైన పనే.
Read: Annapurna Studios: ఓటీటీలో అడుగుపెట్టనున్న అన్నపూర్ణ స్టూడియోస్?