Annapurna Studios: ఓటీటీలో అడుగుపెట్టనున్న అన్నపూర్ణ స్టూడియోస్?

నేడు ఇంటర్నెట్ యుగంలో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ప్రాధాన్యత బాగా పెరిగిందన్న సంగతి తెలిసిందే. అసలే కరోనా కాలంతో థియేటర్లకు వెళ్లి సినిమా చూసే కన్నా ఇంట్లోనే డిజిటల్ లో సినిమా చూసేందుకే ఇప్పుడు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు.

Annapurna Studios: ఓటీటీలో అడుగుపెట్టనున్న అన్నపూర్ణ స్టూడియోస్?

Annapurna Studios Ott

Annapurna Studios: నేడు ఇంటర్నెట్ యుగంలో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ప్రాధాన్యత బాగా పెరిగిందన్న సంగతి తెలిసిందే. అసలే కరోనా కాలంతో థియేటర్లకు వెళ్లి సినిమా చూసే కన్నా ఇంట్లోనే డిజిటల్ లో సినిమా చూసేందుకే ఇప్పుడు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. అందుకే మొన్నటి వరకు సినిమా నిర్మాణం, థియేటర్ల మీద ఆధారపడిన వారు ఇప్పుడు ఓటీటీలపై దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే తెలుగులో మొట్టమొదటి స్ట్రీమింగ్ యాప్ ‘ఆహా’ ఒరిజినల్ కంటెంట్ తో దూసుకుపోతుంది.

ప్రముఖ అగ్ర నిర్మాత, అల్లు అరవింద్ కాంపౌండ్ నుండి వచ్చిన ‘ఆహా’ వెబ్ సిరీస్, షోస్, సినిమా.. కంటెంట్ ఏదైనా మంచి ఆదరణ లభిస్తుంది. దీంతో ఇప్పుడు ఇండస్ట్రీ నుండి అగ్ర నిర్మాణ సంస్థ కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి అడుగుపెట్టనున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ ఇప్పటి వరకు నిర్మాణ రంగంలోనే ఉండగా ఇప్పుడు సొంతంగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ప్రయత్నాలు మొదలుపెట్టిందట.

అన్నపూర్ణ స్టూడియోస్ నుండి రానున్న డిజిటల్ స్ట్రీమింగ్ యాప్ లో సీనియర్ స్టార్ నాగార్జునతో పాటు ఆయన స్నేహితులు కూడా భాగస్వామ్యులుగా ఉండనున్నారట. ఇదే నిజమైతే తెలుగు నుండి రానున్న రెండవ ఒరిజినల్ స్ట్రీమింగ్ యాప్ ఇదే అవుతుంది. కాగా.. సహజంగా హీరోగానే కాదు బిజినెస్ మెన్ గా కూడా నాగ్ సక్సెస్ ఫుల్ అని ఇప్పటికే రుజువు చేసుకున్నారు. నాగ్ టేకప్ చేస్తే ఏదైనా సక్సెస్ అనే పేరుంది. టాలీవుడ్ నుండి మంచి సపోర్ట్ కూడా ఉంటుంది. దీంతో ప్రేక్షకులలో ఈ యాప్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి మొదలైంది.

Read: Allu Arjun Pushpa: మరో మలయాళీ స్టార్‌కు కరోనా.. ఫైనల్‌గా షూటింగ్ వాయిదా!