Allu Arjun Pushpa: మరో మలయాళీ స్టార్‌కు కరోనా.. ఫైనల్‌గా షూటింగ్ వాయిదా!

స్టైలిష్ స్టార్ నుండి అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ గా మార్చేసిన సినిమా పుష్ప. మాజీ లెక్కల మాస్టారు సుకుమార్ అన్ని లెక్కలేసి పుష్పను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా టీజర్స్ ఇప్పటికే సినిమాను ఓ లెవల్లో నిలబెట్టేశాయి.

Allu Arjun Pushpa: మరో మలయాళీ స్టార్‌కు కరోనా.. ఫైనల్‌గా షూటింగ్ వాయిదా!

Allu Arjun Pushpa

Allu Arjun Pushpa: స్టైలిష్ స్టార్ నుండి అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ గా మార్చేసిన సినిమా పుష్ప. మాజీ లెక్కల మాస్టారు సుకుమార్ అన్ని లెక్కలేసి పుష్పను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా టీజర్స్ ఇప్పటికే సినిమాను ఓ లెవల్లో నిలబెట్టేశాయి. బన్నీ పుట్టినరోజున విడుదల చేసిన టీజర్ ఇప్పటికీ యూట్యూబ్లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూనే ఉంది. బన్నీకి మలయాళంలో మంచి మార్కెట్ ఉన్న నేపథ్యంలో అక్కడి నటులను కూడా తీసుకొచ్చిన సుకుమార్ మొత్తంగా పుష్పను మల్టీ లాంగ్వేజెస్ ప్యాక్ గా మార్చేశాడు.

అయితే.. అన్ని సినిమాల మాదిరి ఈ సినిమాకు కూడా కరోనా బ్రేకులు పడ్డాయి. మిగతా సినిమాలన్నీ కరోనా దెబ్బకు వాయిదా పడినా.. ఏకంగా హీరో అల్లు అర్జున్ కు కరోనా సోకినా సుకుమార్ షూటింగ్ మాత్రం ఆపలేదు. హీరో లేని సన్నివేశాలతో పాటు మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ సన్నివేశాలను సుకుమార్ ప్లాన్ చేసుకున్నాడు. అనుకున్న విధంగానే మరో వారం రోజులు షూటింగ్ నడిపించాడు. కానీ అనుకోని విధంగా ఫహద్ ఫాజిల్ కూడా కరోనా బారిన పడి కేరళ వెళ్లపోయినట్లుగా తెలుస్తుంది. దీంతో ఫైనల్ గా షూటింగ్ వాయిదా వేయాల్సి వచ్చినట్లుగా తెలుస్తుంది.

మళ్ళీ పరిస్థితులు చక్కబడితే తప్ప తిరిగి మళ్ళీ షూటింగ్ మొదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. సినిమాలో కీలకమైన కొంత భాగాన్ని కేరళలో, ముఖ్యమైన ఫారెస్ట్ సన్నివేశాలను ఏపీలోని మారేడుమిల్లి, తమిళనాడులోని తెన్ కాశీ పరిసరాలలో షూటింగ్ నిర్వహించిన బృందం తదుపరి షెడ్యూల్ ను వాయిదా వేసుకుంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు ప్లాన్ చేసుకున్నారు. దానికి ఇంకా మూడున్నర నెలల సమయం ఉండగా అప్పటికి షూటింగ్ పూర్తి చేసే అవకాశాలు లేకపోలేదు.

Read: Annapurna Studios: ఓటీటీలో అడుగుపెట్టనున్న అన్నపూర్ణ స్టూడియోస్?