Andhra Pradesh: ఏపీలో ముగిసిన రాష్ట్రపతి ఎన్నికలు.. రేపు ఢిల్లీకి బ్యాలెట్ బాక్స్‌ తరలింపు

ఏపీ అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలకు గాను, 172 మంది శాసన సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. వైసీపీ ఎమ్మెల్యే మహీధర రెడ్డి హైదరాబాద్‍లో తెలంగాణ శాసన సభలో ఓటు వేశారు.

Andhra Pradesh: రాష్ట్రపతి ఎన్నిక కోసం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం నిర్వహించిన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఏపీ అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలకు గాను, 172 మంది శాసన సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏపీకి చెందిన వైసీపీ ఎమ్మెల్యే మహీధర రెడ్డి హైదరాబాద్‍లో ఉండటంతో తెలంగాణ శాసన సభలో ఓటు వేశారు.

Presidential Elections: ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్.. 21న ఫలితాలు

టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. టీడీపీ ఎమ్మెల్యేలు నందమూరి బాలకృష్ణ, బుచ్చయ్య చౌదరి విదేశాల్లో ఉన్న కారణంగా ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని సమాచారం. కరోనా లక్షణాల కారణంగా గుంటూరు ఎమ్మెల్యే మద్దాల గిరి, పీపీఈ కిట్ ధరించి వచ్చి ఓటు వేశారు. ఎన్నికల ప్రక్రియ సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది. అయితే, అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ రావడంతో ఏపీ అసెంబ్లీలో మధ్యాహ్నం 03:15 గంటలకే ఓటింగ్ ప్రక్రియ పూర్తైంది.

Rahul Gandhi: ఉద్యోగాలు లేవు కానీ ట్యాక్సులు మాత్రం ఎక్కువ.. కేంద్రంపై రాహుల్ విమర్శలు

అయినప్పటికీ నిబంధనల ప్రకారం అధికారులు సాయంత్రం ఐదు గంటల వరకు వేచి ఉన్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సును సీల్ చేసి, భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. రేపు ఉదయం విమానంలో ఈ బ్యాలెట్ బాక్సును ఢిల్లీ తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

ట్రెండింగ్ వార్తలు