Anthony Albanese : చాట్, జిలేబీ రుచి చూసిన ఆస్ట్రేలియా ప్రధాని.. మోదీ రికమండ్ చేశారంటూ ట్వీట్

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్‌కి ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ చాట్, జిలేబీ తెగ నచ్చేసింది. జపాన్ రాయబారి హిరోషి సుజుకీ పూనెలో తన భార్యతో కలిసి స్ట్రీట్ ఫుడ్ భలే లాగించేస్తున్నారు. ప్రధాని మోదీ సిఫార్సుతో చాట్, జిలేబీ రుచి చూసినట్లు ఆంథోని ఆల్బనీస్ ట్వీట్ చేసారు. వీరి ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయ.

Anthony Albanese

Anthony Albanese : ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ రుచి చూసారు. సిడ్నీలోని హారీస్ పార్కు లిటిల్ ఇండియాలో  స్ట్రీట్ ఫుడ్‌ను ఆంథోని ఎంతో ఇష్టంగా రుచి చూస్తున్న వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ రికమండ్ చేయడంతో ఆల్బనీస్ చాట్ మరియు జిలేబీని రుచి చూసారు.

Modi Is The Boss: మోదీని బాస్ అంటూ పొగడ్తలు కురిపించిన ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ

@AlboMP అల్బనీస్ తన ట్విట్టర్ అకౌంట్‌లో  ‘లిటిల్ ఇండియాలో శుక్రవారం రాత్రి భలే గడిచింది. చాట్ కాజ్‌లో చాట్ మరియు జైపూర్ స్వీట్స్‌లో జిలేబీ రుచి చూసాము.. భారత ప్రధాని మోదీ సిఫార్సుతో దీనిని ప్రయత్నించాము’ అనే శీర్షికతో పోస్టు చేశారు. మరోవైపు జపాన్ రాయబారి హిరోషి సుజుకీ పూణే స్ట్రీట్ ఫుడ్‌ను ఆస్వాదిస్తున్నారు. తన బెటర్ హాఫ్‌తో కలిసి భారతీయ ఆహారాన్ని ఆస్వాదిస్తూ కనిపించారు. తాజాగా పూణె రెస్టారెంట్‌లో వీరిద్దరూ వడపావ్, మసాల పావ్‌లను ఆస్వాదిస్తున్న వీడియోపై ప్రధాని మోదీ స్పందించారు. ఇండియన్ ఫుడ్ తినే పోటీలో తన వైఫ్ తనను ఓడించిందని జపాన్ రాయబారి పేర్కొన్నారు.

PM Modi-Australia PM Anthony : మోదీజీ మీకు మాటిస్తున్నా.. హిందూ దేవాలయాలపై దాడులు జరిపినవారిపై చర్యలు తీసుకుంటాం : ఆస్ట్రేలియా ప్రధాని

జపాన్ రాయబారి ట్వీట్‌పై మోదీ స్పందిస్తు ‘మిస్టర్ అంబాసిడర్ మీరు ఓడినా గెలిచినా పట్టించుకోరు.. కానీ మీరు ఇండియన్ ఫుడ్ ఆస్వాదిస్తూ తినడం ఏదైతే ఉందో చూడటానికి ఆనందంగా ఉంది. వీడియోలు చేస్తూ ఉండండి’ అంటూ స్పందించారు. ప్రస్తుతం వీరి ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.