Modi Is The Boss: మోదీని బాస్ అంటూ పొగడ్తలు కురిపించిన ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ

భారతదేశం, ఆస్ట్రేలియా మధ్య బంధాన్ని క్రికెట్ పెంచిందని అన్నారు. క్రికెట్‭తో పాటు మస్టర్ చెఫ్ సైతం రెండు దేశాల మద్య సంబంధాల ఏర్పాటుకు దోహదం చేసిందన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలకు ప్రవాస భారతీయులు చేసిన కృషిని ఆయన ప్రశంసించారు

Modi Is The Boss: మోదీని బాస్ అంటూ పొగడ్తలు కురిపించిన ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ

Anthony Albanese: ప్రధానమంత్రి నరేంద్రమోదీని ‘బాస్’ అంటూ సంబోధించారు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అబ్నీస్. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లిన ప్రధాని మోదీ, మంగళవారం సిడ్నీలోని ఉడోస్ బ్యాంక్ ఎరీనాలో ఏర్పాటు చేసి ప్రవాస భారతీయుల కార్యక్రమానికి ఆంథోనీ అబ్నీస్‭తో కలిసి హాజరయ్యారు. కాగా, ఈ కార్యక్రమంలో ఆంథోనీ మాట్లాడుతూ ‘మోదీ ఈజ్ ది బాస్’ అని అన్నారు. అంతే సభలో ఉన్నవారంతా పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. స్టేడియం ఆవరణలో ఇరువురు నేతలకు (మోదీ, అబ్జనీ) అక్కడి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.

The Kerala Story: క్రూరమైన నిజం బయట పడిందట.. ఆ సినిమా చూసిన అనంతరం గవర్నర్ రవి

ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోని అల్బనీస్ మాట్లాడుతూ ‘‘ఇది మా ఆరవ సమావేశం (మోదీ, అల్బనీస్ కలుసుకోవడం). ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య సంబంధం ఎంత కీలకమైనదో మా ద్వైపాక్షిక కలయిక సూచిస్తుంది. భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంద. ప్రపంచవ్యాప్తంగా భారత్ ప్రజాదరణ గల దేశంగా పేరుపొందింది. హిందూ పసిఫిక్ మహాసముద్రంలో ఒక ముఖ్యమైన పొరుగు దేశం. పెట్టుబడులకు భారత్ అనుకూలం’’ అని తెలిపారు.

Rahul Gandhi: వయనాడ్‭లోనే ఉంటే అదే గతి పడుతుంది.. రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డ స్మృతి ఇరానీ

కాగా, ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ భారతదేశం, ఆస్ట్రేలియా మధ్య బంధాన్ని క్రికెట్ పెంచిందని అన్నారు. క్రికెట్‭తో పాటు మస్టర్ చెఫ్ సైతం రెండు దేశాల మద్య సంబంధాల ఏర్పాటుకు దోహదం చేసిందన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలకు ప్రవాస భారతీయులు చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. “మన జీవనశైలి భిన్నంగా ఉండవచ్చు. కానీ ఇప్పుడు యోగా కూడా మనల్ని కలుపుతుంది. క్రికెట్ కారణంగా చాలా కాలంగా మన మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు టెన్నిస్, సినిమాలు కూడా మనల్ని ఏకం చేస్తున్నాయి. మా ఆహార పద్దతులు కూడా భిన్నంగా ఉండవచ్చు. కానీ మాస్టర్‌చెఫ్ కూడా మనల్ని కలుపుతుంది” అని మోదీ అన్నారు.

Narendra Modi: నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో కీలక మార్పు, మోదీతో పాటు..

రెండు దేశాల మధ్య సంబంధాలను 3-C, 3-D, 3-E లుగా మోదీ వర్ణించారు. 3-C అంటే కామన్వెల్త్, క్రికెట్, కర్రీ.. 3D అంటే డెమోక్రసీ, డయాస్పోరా, దోస్తీ.. 3E అంటే ఎనర్జీ(ఇంధనం), ఎకానమీ(ఆర్థిక వ్యవస్థ), ఎడ్యూకేషన్(విద్య). ఇవన్నీ పరస్పర విశ్వాసం, గౌరవం మీద ఆధారపడి ఉన్నాయని ప్రధాని నొక్కిచెప్పారు. బ్రిస్బేన్‌లో త్వరలో భారత కాన్సులేట్‌ను ప్రారంభించనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత, ఇరువురు నేతల్ని అక్కడికి వచ్చినవారు సెల్ఫీల్లో ముంచెత్తారు.