The Kerala Story: క్రూరమైన నిజం బయట పడిందట.. ఆ సినిమా చూసిన అనంతరం గవర్నర్ రవి

గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి ఆదివారం రాత్రి స్థానిక నుంగంబాక్కంలోని ఓ ప్రైవేటు ప్రివ్యూ థియేటర్‌లో భార్యతో కలసి ‘ది కేరళ స్టోరీ’ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు. అవినీతి, ఉగ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన ‘ది కేరళ స్టోరీ’ చిత్రానికి మద్దతు, వ్యతిరేకత రెండూ వచ్చాయి

The Kerala Story: క్రూరమైన నిజం బయట పడిందట.. ఆ సినిమా చూసిన అనంతరం గవర్నర్ రవి

Updated On : May 23, 2023 / 3:36 PM IST

Governor RN Ravi: భారతీయ జనతా పార్టీకి, హిందుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు ఎదుర్కొంటున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఆర్.ఎన్.రవి (Governor RN Ravi) తాజాగా ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందూ మహిళల్ని పెళ్లి పేరుతో మతం మార్చి తీవ్రవాదులుగా మార్చుతున్నారన్న కథాంశంతో తీసిని ఆ సినిమా క్రూరమైన నిజాన్ని బయటపెట్టిందని గవర్నర్ వ్యాఖ్యానించారు. ఇంత పచ్చి నిజాన్ని బయటపెట్టిన చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

Sajjala Ramakrishna Reddy : అందుకే.. అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్ళారు : సజ్జల రామకృష్ణారెడ్డి

గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి ఆదివారం రాత్రి స్థానిక నుంగంబాక్కంలోని ఓ ప్రైవేటు ప్రివ్యూ థియేటర్‌లో భార్యతో కలసి ‘ది కేరళ స్టోరీ’ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు. అవినీతి, ఉగ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన ‘ది కేరళ స్టోరీ’ చిత్రానికి మద్దతు, వ్యతిరేకత రెండూ వచ్చాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వగా, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ సినిమాపై వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా, తమిళనాడులో ఈ చిత్రానికి పెద్దగా ఆదరణ లభించలేదని ధియేటర్‌ యజమానులు చిత్ర ప్రదర్శనకు నిరాకరించారు.

Arvind Kejriwal: మనీష్ సిసోడియా పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు.. వీడియో షేర్ చేసిన ఢిల్లీ సీఎం