‘Terrorist’ : కాల్చిన ఇనుప చువ్వతో ఖైదీ వీపుపై చెక్కిన అధికారి

జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ వీపుపై జైలు సూపరింటెండెంట్‌ ఇనుమ చువ్వ కాల్చి..‘ఆత్వాది’ (టెర్రరిస్టు) అనే చెక్కించారు.

Punjab Jail Authority Branded Terrorist Mark On My Back Claims Prisoner

Jail Authority Branded Terrorist Mark Back Prisoner  నేరస్తులకు జైలుశిక్ష వేసేది. వారిని జైలులో పెట్టేది వారిలో మార్పు రావటానికి. వారిలో మంచి మార్పు వచ్చేలా జైలు అధికారులు చూసుకోవాలి. జైల్లో ఖైదీల పట్ల సానుభూతితో వారిలో మార్పు రావటానికి చర్యలు తీసుకోవాలి. అందుకే జైల్లో ఉండే ఖైదీలకు సైకాలజిస్టులతో కౌన్సెలింగ్ ఇప్పిస్తుంటారు. మంచి చెడుల గురించి చెబుతుంటారు. కానీ జైల్లో అటువంటివి జరుగుతున్నాయా? అంటే ఇదిగో ఈ జైలు అధికారు చేసిన పని చూస్తుంటే అటువంటివేమీ జరగటంలేదు సరికదా..పైగా ఖైదీలు మరింత నేరస్తులయ్యేలా అధికారులు వ్యవహరిస్తున్నారా? అనిపిస్తోంది.

Read more : Prisoners Escaped : సినిమా స్టైల్లో..స్పూనుతో సొరంగం త‌వ్వి జైలు నుంచి పారిపోయిన ఖైదీలు..

పంజాబ్‌లోని బర్నాల జిల్లా జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీపట్ల ఆ జైలు అధికారి అమానుష చర్యకు పాల్పడ్డారు. జైలులో కనీస హక్కులకోసం ఎదురు తిరిగిన కరమ్‌జిత్‌ సింగ్‌ 28 ఏళ్ల ఖైదీపై జైలు సూపరింటెండెంట్‌ బల్బీర్‌ సింగ్‌ ఇనుమ చువ్వ కాల్చి..వాతలు పెట్టారు. ఇనుప చువ్వ బాగా కాల్చి దాంతో కరమ్ జిత్ సింగ్ ‘ఆత్వాది’ అంటే పంబాబీలో టెర్రరిస్టు అనే అక్షరాలు చెక్కించారు.

దాదాపు 12 కేసుల్లో దోషిగా తేలిన బాలామ్‌ఘర్‌కు చెందిన కరమ్‌జిత్‌ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ కేసులకు సంబంధించి అతనికి 20ఏళ్ల జైలుశిక్ష పడింది. దీంతో కమర్ జిత్ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈక్రమంలో డ్రగ్స్‌ కేసుకు సంబంధించి కోర్టులో వాదనలు జరిగుతున్న సమయంలో అతను తన బాధను వెళ్లగ్రక్కాడు.జైలు సూపరింటెండెంట్‌ బల్బీర్‌ సింగ్‌ తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారనీ..తనపై అస్తమాను దాడి చేస్తున్నారని..ఈ హింసల్లో భాగంగా సూపరింటెండెంట్‌ నా ఒంటిపై ‘ఆత్వాది’ అని ఇనుప చువ్వతో కాల్చాడని కోర్టు దృష్టికి తీసుకురావటంతో ఈ ఘటన వెలుగుచూసింది. నేను చెడు ముద్ర వేయటానికి నాకు జైలు శిక్ష తగ్గకుండా ఉండటానికి ఈ శిక్ష మరింతగా పెరగటానికి సూపరింటెండెంట్‌ తనపై ఇలా దాడులు చేస్తున్నారని తెలిపాడు.

Read more : Gang war in Prison: జైలులో గ్యాంగ్‌ వార్‌..116కు చేరిన మృతులు

ఈ ఆరోపణల గురించి న్యాయమూర్తి జైలు సూపరింటెండెంట్‌ ను ప్రశ్నించగా ఆయన వాటిని ఖండించారు. కరమ్‌జిత్‌ తరచూ నేరాలు చేసి జైలుకొస్తాడని, సానుభూతి కోసం కట్టు కథలు చెబుతాడని..ఇవన్నీ నాపై అతని ఆరోపణలు మాత్రమే ననీ.. తెలిపారు. “600 మంది ఖైదీలు ఉన్న జైల్లో ఇనుప రాడ్‌తో ఇంత నీట్‌గా ఎవరు రాస్తారు? పచ్చబొట్లు వేయటానికి ఉపయోగించే సిరాతో ఎవరో అతని వీపుపై అలా రాసినట్లుగా ఉందని సమర్ధించుకున్నారు. ఖైదీల బ్యారక్‌లో ఇటీవల జైలు అధికారులు తనిఖీలు జరపగా.. సెల్‌ఫోన్‌ దొరికిందని సూపరింటెండెంట్‌ తెలిపారు. నిందితుడు ఇంతకు ముందు పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడని తెలిపారు.

ఈ ఘటనపై పంజాబ్‌ ఉప సీఎం సుఖ్‌జిందర్‌ రణ్‌ధావా విచారణకు ఆదేశించారు. ఫిరోజ్‌పూర్‌ డీఐజీ తేజింద్‌ సింగ్‌ మౌర్‌ను విచారణ అధికారిగా నియమించారు. మరోవైపు సిక్కులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ఘటనకు బాధ్యుడైన జైలు సూపరింటెండెంట్‌ను సస్పెండ్‌ చేయాలని అకాలీదళ్‌ అధికార ప్రతినిధి మన్‌జిందర్‌ సింగ్‌ సిర్సా డిమాండ్‌ చేశారు.