Prisoners Escaped : సినిమా స్టైల్లో..స్పూనుతో సొరంగం త‌వ్వి జైలు నుంచి పారిపోయిన ఖైదీలు..

స్పూనుతో సొరంగం తవ్వి సినిమా స్టైల్లో ఖైదీలు జైలునుంచి పారిపోయారు. దీంతో షాక్ అయిన అధికారులు వారి కోసం గాలిస్తున్నారు.

Prisoners Escaped : సినిమా స్టైల్లో..స్పూనుతో సొరంగం త‌వ్వి జైలు నుంచి పారిపోయిన ఖైదీలు..

Prisoners Escaped

six prisoners escaped from the jail in tunnel dug with a spoon : టాలీవుడ్ నుంచి  హాలీవుడ్ దాకా ఖైదీలు జైలు నుంచి ఎలా పారిపోవాలో చూపించారు. సొరంగాలు తవ్వి పారిపోయిన సీన్లు ఎన్నో ఉన్నాయి. ఓ తుప్పు పట్టిన స్పూన్ తోనే లేదా ఖైదీలు భోజనాలు చేసే సత్తు కంచాలతోనే గోడలకు కన్నాలు పెట్టేసి..నేలకు సొరంగాలు తవ్వేసిన పారిపోయినట్లుగా చూశాం. మోగాస్టార్ చిరంజీవి నటించిన వేట్ సినిమాలో చిరంజీవి ఓ సత్తు కంచంతో సొరంగం తవ్వి అండమాన్ జైలునుంచి ఎలా బయటపడ్డాడో చూశాం.

అటువంటి సీన్లను స్ఫూర్తిగా తీసుకున్నారో ఏమోగాని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న ఇజ్రాయెల్‌ లోని ఓ జైలు నుంచి ఖైదీలు సొరంగం తవ్వి దాని గుండా పారిపోయారు. దీంతో అధికారులు షాక్ అయ్యారు. వెయ్యి కళ్లతో కాపలా కాస్తున్నా..ఇంత పటిష్టమైన సెక్యూరిటీ ఉన్నా ఖైదీలు ఎలా తప్పించుకున్నారో గుర్తించారు. అనంతరం షాక్ అయ్యారు. ఖైదీలు ఎలా సంపాదించారో గానీ త‌మ ద‌గ్గ‌ర ఉన్న ‘‘తుప్పు ప‌ట్టిన చెంచాల‌’’తో ఓ సొరంగాన్ని త‌వ్వి.. అందులో నుంచి పారిపోయినట్లుగా గుర్తించారు. దీంతో పారిపోయిన ఖైదీల కోసం ఇజ్రాయెల్ భ‌ద్ర‌తా బ‌ల‌గాలు గాలిస్తున్నాయా. ప్రతీ అంగుళాన్ని జల్లెడపడుతున్నాయి.

పారిపోయిన ఆరుగురు ఖైదీల్లో ఐదుగురు ఇస్లామిక్ జిహాద్‌కు చెందిన వాళ్లుగా అధికారులు గుర్తించారు. వారిలో ఒకరు అల్‌-అక్సా మార్టిర్స్ బ్రిగేడ్ నాయ‌కుడు. వీళ్లంతా గిల్బోవా జైల్లో ఒకే సెల్‌లో ఉండేవారు. అందులో ఉన్న ఓ సింక్‌ను ఆధారంగా చేసుకొని భారీ సొరంగం త‌వ్వి పారిపోయినట్లు జైలు అధికారులు గుర్తించారు. ఇజ్రాయెల్ లోని గిల్బోవా జైలు నుంచి పాల‌స్తీనా ఖైదీలు పారిపోవ‌డం అంత ఈజీ కాదు.చీమ చిటుక్కుమన్నా పోలీసులు పసిగట్టేస్తారు. ప్రతీ అంగుళం అత్యంత భద్రతతో ఉంటుంది. కానీ ఖైదీలు ఎస్కేప్ అయిన విధానంతో ఇజ్రాయెల్ ప్ర‌ధాని న‌ఫ్తాలీ బెనెట్ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు.

జైలు గ‌ది డిజైన్‌లో ఉన్న లొసుగుల‌ు బాEగా ఆకళింపు చేసుకున్నారు ఖైదీలు. జైలు సెల్ లో ఉన్న సింక్ కింద ఉన్న ఓ సంపు (మోరీ)ని ఆసరాగా చేసుకుని పక్కా ప్లాన్ వేశారు.ఏమాత్రం అనుమానం రాకుండా సొరంగం త‌వ్వి పారిపోయారని ఇజ్రాయెల్ జైళ్ల శాఖ క‌మిష‌న‌ర్ కేటీ పెర్రీ వెల్ల‌డించారు. జైలు గోడ‌ల వెనుక ఉన్న ఖాళీ ప్ర‌దేశం ఖైదీల‌కు బాగా ఉపయోగపడిందనీ..పక్కా ప్లాన్ చేసి ఎస్కేప్ అయ్యారని తెలిపారు.

కానీ బయటివారి సహకారం కూడా వీరికి అంది ఉంటుందని అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘ‌ట‌న త‌ర్వాత అధికారులు జైల్లోని మిగ‌తా 400 మంది ఖైదీల‌ను మ‌రో జైలుకు త‌ర‌లించారు. జైలు నుంచి త‌ప్పించుకున్న ఖైదీలు.. ఇప్ప‌టికే పాల‌స్తీనీయుల‌కు ఎంతో కొంత ప‌ట్టు ఉన్న జెనిన్ వైపు వెళ్తున్న‌ట్లు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో వారి కోసం జల్లెడపడుతున్నారు.

ఓ తుప్పు ప‌ట్టిన చెంచాను ఎలాగోలా సేకరించి జైలు గదిలో ఉన్న ఓ ఫోటో వెనుక దాచి పెట్టుకున్నారని..ఆ తరువాత ఎవ్వరికీ కనీసం అనుమానం కూడా రాకుండా సొరంగం తవ్వి పారిపోయారన స్థానిక మీడియా వెల్లడించింది. కాగా సొరంగం తవ్విన చప్పుడు కానీ తవ్విన వ్యర్ధాలను ఎలా దాచి పెట్టారో కూడా తెలియకుండా అత్యంత చాకచక్యంగా పారిపోయారని తెలిపింది. కాగా..జైలునుంచి పారిపోయిన ఆరుగురు ఖైదీల్లో న‌లుగురు జీవిత‌ఖైదు శిక్ష‌ను అనుభ‌విస్తున్నారని తెలిపింది.