Puri Jagannadh Cameo In Chiranjeevi Godfather Movie
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేసిన చిరు, మరికొన్ని సినిమాల్లో నటిస్తూ యంగ్ హీరోలకు పోటీగా మారాడు. కాగా తమిళ దర్శకుడు మోహన్ రాజా డైరెక్షన్‌లో గాడ్‌ఫాదర్ అనే సినిమా షూటింగ్‌ను చివరిదశకు తీసుకొచ్చాడు మెగాస్టార్. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్‌గా వస్తున్న గాడ్‌ఫాదర్ చిత్రంలో చిరు ఓ సరికొత్త లుక్‌లో కనిపిస్తాడని చిత్ర యూనిట్ అంటోంది.
Godfather: చిరుతో సల్మాన్.. ముంబైలో మొదలు కానున్న యాక్షన్!
ఇక ఈ సినిమాలో పలువురు కీలక నటీనటులు మనల్ని ఎంటర్‌టైన్ చేయబోతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇప్పటికే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని.. తన పాత్రకు సంబంధించి షూటింగ్‌ను కూడా సల్మాన్ ముగించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో మరో క్రేజీ డైరెక్టర్ కూడా చేరారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ సినిమాలో ఓ కేమియో పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
Chiranjeevi: టార్గెట్ ఆగస్ట్ అంటోన్న గాడ్‌ఫాదర్..?
గాడ్‌ఫాదర్ చిత్రంలో ఓ జర్నలిస్ట్ పాత్రలో పూరీ కనిపించబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. పూరీ పాత్ర చాలా ప్రాధాన్యతను కలిగి ఉంటుందని.. తన పాత్ర నచ్చడంతో పూరీ కూడా వెంటనే ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించాడని తెలుస్తోంది. ఈమేరకు ‘గాడ్ ఫాదర్’ చిత్ర టీమ్‌ను పూరీ కలిసిన ఫోటోను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్, బిజు మీనన్, అనసూయ, గద్దర్, మురళీ మోహన్, గంగవ్వ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, ఈ చిత్రాన్ని ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ చిత్రంగా రాబోతున్న ‘గాడ్‌ఫాదర్’ చిరంజీవి కెరీర్‌లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.
నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు,వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని,హైదరాబాద్ వచ్చాడు.ఒకటి అరా వేషాలు వేసాడు ఇంతలో కాలం చక్రం తిప్పింది.స్టార్ డైరెక్టర్ అయ్యాడు.కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా..అందుకే
introducing my @purijagan in a special role,from the sets of #Godfather pic.twitter.com/8NuNuoY33j— Chiranjeevi Konidela (@KChiruTweets) April 9, 2022